Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని నెలకొల్పిందో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, అతి త్వరలోనే 2000 కోట్ల రూపాయిల మార్కుని అందుకోనుంది. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి ‘గంగమ్మ తల్లి జాతర’ ఎపిసోడ్. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సన్నివేశం సుమారుగా 20 నిమిషాల నిడివి తో ఉంటుంది. ఈ సన్నివేశం మొత్తం అల్లు అర్జున్ తన నట, నాట్య విశ్వరూపం చూపించేసాడు. ఆయన పెర్ఫార్మన్స్ థియేటర్స్ లో నిజంగానే కొంతమందికి అమ్మోరు సోకినట్టు అయ్యింది. వాళ్లంతా పూనకలొచ్చి ఊగిపోవడం వంటివి వీడియోల ద్వారా మన కళ్లారా చూసాము.అయితే ఈ పాట గురించి ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక అల్లు అర్జున్ అభిమాని, ఈ పాట పాడింది ఎవరు అనే విషయాన్నీ డీ కోడ్ చేస్తూ, ఇదేంటి ఎన్టీఆర్ వాయిస్ లాగా ఉంది అంటూ ఒక వీడియో చేసాడు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అచ్చు గుద్దినట్టు ఎన్టీఆర్ పాడినట్టే సింక్ చేస్తే ఈ వీడియో ని జత చేసారు. అయితే అది కేవలం అభిమానుల సంబరం మాత్రమే కానీ, వాస్తవానికి ఈ పాటని పాడింది ఎన్టీఆర్ కాదు, మహాలింగం. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ రాయగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కేవలం పుష్ప 2 చిత్రంలోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈ పాట ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. దీనికి ఆస్కార్ అవార్డు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు.
ఇకపోతే ఈ నెల 11 వ తేదీ నుండి పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ థియేటర్స్ లో ప్రదర్శింపబడబోతుంది. 20 నిమిషాల అదనపు సన్నివేశాలను జత చేస్తూ మేకర్స్ ఈ సంక్రాంతికి మరోసారి థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు లో ఈ సినిమాకి థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే, కానీ హిందీ లో మాత్రం ఇప్పటికీ డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకొని పోతుంది. ఇప్పుడు ఈ అదనపు సన్నివేశాల కోసం థియేట్రికల్ రన్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు లేకపోలేదు. 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఎలా అయినా కొట్టాలి అనేదే మేకర్స్ గోల్ గా పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ రీ లోడెడ్ వర్షన్ కి ఎంత వసూళ్లు రాబోతున్నాయి అనేది. మరో రెండు రోజుల్లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం రాబోతుంది. ఈ సినిమాని తట్టుకొని హిందీ వెర్షన్ లో పుష్ప 2 ఇప్పటికీ నిలబడగలదా లేదా అనేది చూడాలి.