Homeలైఫ్ స్టైల్100 Fishermen: అక్కడ చేపల కోసం 100 మంది మత్స్యకారులు.. కిలోమీటర్ పొడవున ఉండే వల...

100 Fishermen: అక్కడ చేపల కోసం 100 మంది మత్స్యకారులు.. కిలోమీటర్ పొడవున ఉండే వల ఒకేసారి వేస్తారు.. ఎందుకో తెలుసా?

100 Fishermen: మాంసకృతుల్లో చేపలు చాలా ఆరోగ్యకరమైనవి. మిగతా మాంసాహారుల్లో కంటే వీటిలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి ఎలాంటి హాని చేయని పదార్థాలు చేపల్లో ఉండడం వల్ల వీటిని ఎక్కువగా తినాలని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో అనేక రకాల చేపలు ఉన్నాయి. కానీ సముద్ర తీరంలో దొరికే చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని కొందరు అంటుంటారు. అందుకే సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు ప్రతిరోజు చేపల వేట కోసం సాగరానికి వెళ్తారు. కొందరు గుంపులుగా.. మరికొందరు వ్యక్తిగతంగా వెళ్లి చేపలను పట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకేసారి వందమంది.. కిలోమీటర్ పొడవను ఉండే వల చేపలు పట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అలా ఎందుకు వేస్తారో తెలుసా..? ఇంతకీ ఆ వలలో ఎలాంటి చేపలు పడతాయో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి..

ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం ఎక్కువ భాగం సముద్ర తీరాన్ని కలిగి ఉంటుంది. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు నిత్యం చేపల పట్టడమే జీవానాధారంగా చేసుకుంటూ ఉంటారు. వీటిలో బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరం ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సముద్ర తీరం పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉన్న సూర్యలంక బీచ్ చూడడానికి చాలామంది తరలివస్తారు. అయితే ఇక్కడి బీచ్ అందాలు మాత్రమే కాకుండా.. ఇక్కడ దొరికే చేపలు కూడా ప్రత్యేకమైనవే. ఈ బీచ్ తీరంలో మత్తి, మక్కే అనే రకపు చేపలు దొరుకుతూ ఉంటాయి. వీటిని పట్టుకోవడానికి మత్స్యకారులు పెద్ద ప్రణాళిక వేస్తారు. దాదాపు కిలోమీటర్ పొడవు ఉండే ఒక వలను తయారు చేసి ఈ వలను 100 మంది మత్స్యకారులు ఒకేసారి సముద్రంలోకి వెళ్లి వేస్తారు. తీరం నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్లి సముద్రంలో వేయగా ఈ వలలో టన్నులకొద్దీ చేపలు పడుతూ ఉంటాయి. వీటిలో మత్తి, మక్కే అనే చేపలు ఎక్కువగా పడుతుంటాయి.

అయితే మత్తి, మక్కే చేపలను ఎలా గుర్తిస్తారు..? అవి ఈ వలలోనే ఎందుకు పడతాయి..? అనే సందేహం రావొచ్చు. మత్తి, మక్కే చేపలు సముద్రంలో వచ్చే అలలతో టన్నులకొద్దీ ఒకేసారి ప్రయాణిస్తాయి. ఇవి వచ్చేముందు సముద్ర తీర ప్రాంతంలో సిగల్స్ పక్షులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఇవి తిరుగుతున్న చోటే మత్తి, మక్కే చేపలు ఉంటాయని మత్స్యకారులు అంటున్నారు. ఆ తర్వాత వెంటనే వందమంది మత్స్యకారులు కలిసి ఒక పెద్ద వలను తీసుకెళ్లి సిగల్స్ పక్షులు తిరిగే చోట వలను వేస్తారు. ఈ వలలో టన్నులకొద్దీ చేపలు పడుతూ ఉంటాయి.

మత్తి, మక్కే చేపలకు తమిళనాడు, కేరళలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పట్టుకొని అక్కడికి ఎగుమతి చేస్తారు. అయితే వలలో ఒకేసారి టన్నుల కొద్దీ చేపలు పడడం వల్ల మత్తి, మక్కే చేపలను ప్రత్యేకం చేస్తారు. వీటిని ఏరడానికి దాదాపు 150 మంది కూలీల పని చేస్తారని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. అయితే మత్తి, మక్కే చేపలకు తమిళనాడు, కేరళలో డిమాండ్ ఎక్కువ.. కానీ స్థానికంగా వీటికి ధర తక్కువగానే ఉంటుంది. ఇవి కిలో రూ. 10 నుంచి రూ.20 వరకు మాత్రమే విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం ఈ రకమైన చేపలు ఎక్కువగా వలలో పడడం లేదని కొందరు మత్స్యకారులు పేర్కొంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version