Mirai and Kishkindhapuri success: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది దర్శకులు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జా లాంటి నటుడు సైతం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి హనుమాన్, మిరాయి లాంటి వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ పాన్ సబ్జెక్టులే కావడం విశేషం…ఇక రీసెంట్ గా వచ్చిన మిరాయి సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఆయన స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ప్రస్తుత స్టార్ డైరెక్టర్లు సైతం సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం కిష్కింధపురి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
హార్రర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సగటు ప్రేక్షకులందరిని మెప్పిస్తోంది. ఇంకా ఇప్పటికే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక గొప్ప సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే రెండు సినిమాల చివర్లో శ్రీరాముడిని వాడుకున్నారు.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో శ్రీ రాముడిని ఏఐ ద్వారా క్రియేట్ చేసి చూపించారు. కానీ మీరు కిష్కింధపురి సినిమాలో మాత్రం రామాలయంలో హీరో చేతికి పూజారి ఒక కడెం అయితే పెడతాడు. ఇక దానితోనే హీరో దెయ్యాన్ని ఎదిరించి దాన్ని ఇక్కడి నుంచి పారద్రోలుతాడు…ఇక మొత్తానికైతే రెండు సినిమాల సక్సెస్ వెనక శ్రీ రాముడు ఉన్నాడనేది చాలా బలంగా వినిపిస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు దేవుళ్లను వాడుకొని సక్సెస్ సాధించడమనేది ఒక ట్రెండ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క దర్శకుడు సైతం చివర్లో ఎలాగైనా సరే దేవుని పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు… ఇకమీదట రాబోయే చాలా సినిమాలు కూడా దేవుడి సెంటిమెంట్ ను వాడుకొని సూపర్ సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…