Bigg Boss 8 Telugu: ఇంతకు ముందు సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ 8 కి ఎక్కువ ఆదరణ రావడానికి కారణం ఆ ఒక్కడేనా..?

తెలుగులో చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్న టీవీ షోలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్నింటికి మాత్రమే ఇక్కడ చాలా మంచి ఆదరణ అయితే దక్కుతూ ఉంటుంది...వాటిలో బిగ్ బాస్ షో ఒకటి... ప్రస్తుతం ఈ షో చాలా మంచి పాపులారిటీ ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది...

Written By: Gopi, Updated On : September 21, 2024 10:09 am

Bigg Boss 8 Telugu(51)

Follow us on

Bigg Boss 8 Telugu: తెలుగు టెలివిజన్ షోలలో అత్యంత బిగ్ బాస్ చాలా మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది.ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన సీజన్ 8 నడుస్తుంది. ఇక దీనికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సీజన్ మిగతా అన్ని సీజన్ల కంటే కూడా మంచి పాపులారిటి ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది అంటూ పలువురు ఈ షో మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికైతే ఈ షో లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చిన కూడా గత సీజన్ల కంటే ఈ సీజన్ చాలా పాపులారిటీ ని సంపాదించుకోవడంలో మాత్రం ఒక వ్యక్తి చాలా కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు. ఆయన ఎవరు అంటే నాగార్జున… అవును మీరు విన్నది నిజమే ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంలో మాత్రం కీలక పాత్ర వహిస్తున్నాడనే చెప్పాలి. కంటెస్టెంట్లు చాలా బాగా టాస్క్ లను పర్ఫార్మ్ చేస్తూ వాళ్ల క్రేజ్ ను పెంచుకుంటున్నప్పటికీ నాగార్జున వల్లే ఈ సీజన్ అనేది భారీగా హిట్ అవుతుందనే చెప్పాలి.

ఇక ఈ సీజన్ నాగార్జున వల్ల ఎందుకు హిట్ అవుతుంది అంటే గత సీజన్లలో కంటెస్టెంట్లు ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చినా కూడా నాగార్జున కొంతమంది మీద పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. దానివల్ల బిగ్ బాస్ షో లో ఎవరైతే రాంగ్ గేమ్ ఆడుతున్నారో వాళ్లని వదిలేసి రైట్ గేమ్ ఆడే వాళ్ళని నాగార్జున ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా అనిపించేది. దానివల్ల మంచి కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేసే ఆడియన్స్ షో మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక షో చూడడం మానేశారు.

కానీ ఈ సీజన్లో మాత్రం నాగార్జున ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎవరైతే రాంగ్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ నాగార్జున చాలా బాగా మాట్లాడుతున్నాడు. గేమ్ ఆడుతూ హౌజ్ లో బాగా ఉండే వ్యక్తుల పట్ల ఆయన చూపించే విధానం అందరికీ నచ్చుతుంది. కాబట్టి ఈ సీజన్ చాలా పాపులారిటి ని సంపాదించుకుందనే చెప్పాలి.

గత సీజన్ మొత్తం అదే మైనస్ గా మారింది. దానివల్ల నాగార్జున మీద అప్పట్లో కొంతవరకు నెగిటివిటీ కూడా పెరిగింది. ఇక అందుకే బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున కలిసి ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనే దానిమీద చాలా రకాల చర్చలు జరిపిన తర్వాత షో ను షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…