https://oktelugu.com/

Singareni Bonus 2024: సింగరేణి కార్మికులకు ఈ దసరా ‘పండుగే’.. ఒక్కొక్కరికి ఎన్ని లక్షలు వస్తాయంటే?

సింగరేణి కార్మికులకు సంస్థ సాధించిన లాభాల్లో వాటా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. 1999లో మొదలైన ఈ ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది. నాటి సింగరేణి పరిస్థితి దృష్ట్యా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లాభాల్లో వాటా ఇస్తామని కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 21, 2024 / 10:15 AM IST

    Singareni Bonus 2024

    Follow us on

    Singareni Bonus 2024: సింగరేణి సంస్థ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో వాటా కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.4,701 కోట్ల లాభాలు గడిచింది. అందులో పెట్టుబడులు పోను నికరంగా రూ.2,412 కోట్లు లాభాలు చూపించింది. ఈ మొత్తం నుంచి ఈ ఏడాది 33 శాతం వాటా కింద రూ.796 కోట్లు కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో సీనియర్‌ కార్మికునికి సగటున సుమారు రూ.1.90 లక్షల వరకు రానున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.2,222 కోట్ల లాభాలు ఆర్జించగా అందులో నుంచి 32 శాతంగా రూ.711 కోట్లు పంపిణీ చేశారు. లాభాలు, వాటా శాతం పెరగడంతో క్రితంసారితో పోల్చితే ఈసారి అదనంగా రూ.20 వేలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

    కాంట్రాక్టు కార్మికులకు తొలిసారి..
    ఇక సంస్థలో 40 వేల మంది పర్మినెంట్‌ కార్మికులు ఉండగా, 27 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరు కూడా పర్మినెంట్‌ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిలో, సంస్థ లాభాల్లో భాగస్వాములవుతున్నారు. దీంతో తమకూ లాభాల్లో వాటా ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. కానీ, యాజమాన్యం, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం సంస్థ లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేల చొప్పున బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. పర్మినెంట్‌ కార్మికులకు పంపిణీ చేసే 33శాతం వాటా పోను మిగతా 67 శాతం నుంచి ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. కంపెనీ వ్యాప్తంగా సుమారు 27 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరికి సుమారు రూ.13 కోట్లు చెలించనున్నారు

    వరద బాధితులకు రూ.10.25 కోట్లు..
    తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. వరద బాధితల కోసం కార్మికుల ఒక రోజు వేతనం ప్రభుత్వానికి ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. కానీ, కార్మిక సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. సంస్థ లాభాల నుంచే విరాళంగా ఇవ్వాలని కోరారు. దీంతో యాజమాన్యం రూ.10.25 కోట్లు ప్రభుత్వానికి వరద బాధితల కోసం అందించనుంది.

    1999 నుంచి లాభాల్లో వాటా..
    సింగరేణిలో కార్మికులకు లాభాల వాటా పంపిణీ 1999 నుంచి మొదలైంది. నాడు ఓసీపీలో యంత్రాలను వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మె చేశారు. దీంతో అప్పటి సీఎం చంద్రబాబునాయకుడు నాటి గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో చర్చలు జరిపారు. సంస్థ లాభాల్లోకి వస్తే కార్మికులకు వాటా ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టం వస్తే వేతనాల్లో కోత విధిస్తామని ప్రకటించారు. దీంతో ఈమేరు కార్మిక సంఘంతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో కార్మికులు కష్టపడి పనిచేసి సంస్థను లాభాల్లోకి తెచ్చారు. ఏటేటా లాభాలు పెరుగుతున్నాయి. దీంతో కార్మికులకు ఇచ్చే లాభాలూ పెరుగుతున్నాయి. మొదట 10 శాతం లాభాల వాటా ఇచ్చారు. ప్రస్తుతం 33 శాతం చెల్లించనున్నారు.
    లాభాల వాటా వివరాలు
    సం. లాభం(రూ. కోట్లు) శాతం చెల్లించినవి(రూ.కోట్లు)
    2010–11 286.01 16 56.16
    2011–12 358.27 17 60.09
    2012–13 401 18 72.18
    2013–14 418 20 83.60
    2014–15 490.44 21 103.11
    2015–16 1006.13 23 245.21
    2016–17 395.38 25 98.85
    2017–18 1212.75 27 326.25
    2018–19 1766.44 28 493.82
    2019–20 993.86 28 278.26
    2020–21 272.64 29 79.06
    2021–22 1227.04 30 368
    2022–23 2222 32 711
    2023–24 2412 33 796