Venkatesh Devi Putrudu: వెంకటేష్ దేవి పుత్రుడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి అదొక్కటే కారణమా…?

దేవిపుత్రుడు సినిమా అందరి ఊహలను తలకిందులు చేస్తూ భారీ డిజాస్టర్ గా మిగలడం అనేది అప్పట్లో వెంకటేష్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : February 28, 2024 11:07 am
Follow us on

Venkatesh Devi Putrudu: ఒక సినిమా స్టోరీ ఎంత బాగున్నా కూడా దానికి అనుగుణమైన స్క్రీన్ ప్లే లేకపోతే ఎంతటి సినిమా అయిన డిజాస్టర్ గా మారాల్సిందే. ఇక అలాంటి కోవకు చెందిన సినిమానే విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా, కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవిపుత్రుడు(Devi Putrudu) సినిమా… ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అయితే భారీ గ్రాఫిక్స్ తో కూడిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ భారీ డిజాస్టర్ గా మిగలడం అనేది అప్పట్లో వెంకటేష్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పాలి…

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ద్వారకాకు సంబంధించిన విషయాల గురించి చెప్తారు. కానీ వాటిని డీప్ గా చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. అలాగే కొన్ని సీన్లనైతే మనం అసలు చూడలేని విధంగా ఉంటాయి. సినిమా స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే ని చాలావరకు ఫాస్ట్ గా రాసుకొని చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏం లేకుండా చూసుకుంటే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయి ఉండేది. అయితే దీనికి ముందు కూడా కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవి అనే ఒక భారీ గ్రాఫికల్ మూవీ వచ్చి సూపర్ సక్సెస్ సాధించింది. ఇక దాంతో ఈ సినిమా మీద కూడా ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలలైతే ఉన్నాయి.

కానీ వాటిని అందుకోవడంలో ఈ సినిమా చాలావరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో కనక వెంకటేష్ హిట్టు కొట్టినట్లయితే ఆయన కెరియర్ లోనే ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచేది. ఇక మొత్తానికైతే వెంకటేష్ ఒక డిఫరెంట్ సినిమా తీసినప్పటికీ అది అంత పెద్దగా వర్క్ అవుట్ అయితే కాలేదు. ఇక అప్పటి నుంచి అలాంటి సినిమాలను చేయడం కూడా వెంకటేష్ మానేశాడు. అందుకే కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఇంకా వెంకటేష్ ఆ సినిమాకి సంబంధించిన మేకోవర్లో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…