Salaar Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా ఇప్పటికే 600 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి ఇండియాలోనే 2023 వ సంవత్సరంలో రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో వన్ ఆఫ్ ది టాప్ కలక్షన్లని రాబట్టిన సలార్ సినిమాగా సలార్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలక్షన్లు వస్తున్నాయి. ఒక బాలీవుడ్ లోనే 100 కోట్లకు పైన వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లో కలక్షన్ల పరంగా మంచి రికార్డుని అందుకుంటుంది.
గడిచిన రెండు రోజుల నుంచి బాలీవుడ్ లో కలక్షన్లు కొద్దివరకు తగ్గుతున్నాయనే చెప్పాలి. అయితే బాలీవుడ్ లో కలక్షన్లు తగ్గడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సినిమాకి బాలీవుడ్ లో సరైన ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ప్రశాంత్ నీల్, ప్రభాస్ ల మీదనే ఈ సినిమా అక్కడ మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. ఒకవేళ సినిమా యూనిట్ కనక మంచి ప్రమోషన్స్ ని చేయగలిగితే సలార్ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ కి 200 కోట్లకు పైన కలక్షన్లని వసూలు చేసేది. కానీ ఏ ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమా బరిలోకి దిగడం వల్లే ఈ సినిమా బాలీవుడ్ లో 100 కోట్ల పైన మాత్రమే కలెక్ట్ చేసింది.
సరైన ప్రమోషన్స్ కనుక పడి ఉంటే ఈ సినిమా ఆల్మోస్ట్ 200 కోట్లకు పైన కలెక్షన్స్ ని ఈజీగా రాబట్టేది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… సలార్ సినిమాకి కేవలం ప్రమోషన్స్ తగ్గడం వల్లే కలక్షన్స్ తగ్గాయి లేకపోతే ఈ సినిమా అనేది లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టేది అనేది మాత్రం వాస్తవం.ఈ సినిమాకి తెలుగులో కూడా అంత పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు.ఈ సినిమాకి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు.
అయినప్పటికీ తెలుగులో ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇక్కడైతే నడిచింది. కానీ బాలీవుడ్ లో ఇంకొంచెం ప్రమోషన్స్ చేసుంటే బాగుండేదని ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కూడా అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది…నిజానికి ప్రశాంత్ నీల్ ప్రమోషన్స్ చేయడం లో చాలా వీక్ గా ఉంటాడు అదే రాజమౌళి అయితే భారీ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తాడు…