Pawan Kalyan - Aamir Khan
Pawan Kalyan – Aamir Khan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కాంబినేషన్స్ తో కాకుండా కేవలం తన బ్రాండ్ ఇమేజి తో హిట్లు , ఇండస్ట్రీ హిట్లు మరియు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఒక సినిమాకి హైప్ రావాలంటే కేవలం ఆయన పేరు కనిపిస్తే చాలు, సహజంగానే హైప్ వచ్చేస్తుంది.
ఓటీటీ లో ఏళ్ళ తరబడి మగ్గి పడున్నసినిమాలను కూడా రీమేక్ చేసి వాటికి కూడా ఆడియన్స్ లో విపరీతంగా హైప్ రప్పించి, బంపర్ ఓపెనింగ్స్ రప్పించడం పవన్ కళ్యాణ్ కి అలవాటు. ఆయనతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి కనీసం ఒక్క సినిమా అయిన చెయ్యాలని ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టుగా అనిపిస్తున్న ఈ సినిమా అప్పుడే నాలుగు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. దీంతో 50 శాతం షూటింగ్ అయ్యిందట, నాల్గవ షెడ్యూల్ లో ఈ సినిమా లో విలన్ గా ఎంపికైన బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ పాల్గొన్నాడు. ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కొంత వరకు చేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఇమ్రాన్ హష్మీ కంటే ముందుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ని సంప్రదించారట.
అమీర్ ఖాన్ కి బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే, ఆయనని ఈ సినిమాలో తీసుకొవడం వల్ల నార్త్ లో ఈ చిత్రానికి తిరుగు ఉండదని అనుకున్నారు. అమీర్ ఖాన్ ని కలిసి కథని వినిపించాడట. ఆయనకీ కథ బాగా నచ్చింది కానీ డేట్స్ లేవు, ఆయన ఇచ్చే డేట్స్ లో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండదు,దాంతో ఈ ప్రాజెక్ట్ కి అమీర్ ఖాన్ నో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ అమీర్ ఖాన్ ఒప్పుకొని ఈ సినిమా చేసి ఉంటే బాలీవుడ్ లో కూడా బాక్స్ ఆఫీస్ షేక్ ఆయ్యేది అని చెప్పొచ్చు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Is that the movie that pawan kalyan aamir khan combination missed movie lovers are out of luck
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com