https://oktelugu.com/

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మిస్ చేసుకున్న హాలీవుడ్ యాక్షన్ చిత్రం అదేనా..? కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒక్క పాన్ ఇండియన్ సినిమా చేయకపోయినా, పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని, ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 05:46 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu :  ఒక్క పాన్ ఇండియన్ సినిమా చేయకపోయినా, పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని, ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా ఆ లిస్ట్ లో చేరాడు కానీ, ఆయన లీగ్ వేరు. రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం సాధించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా లెవెల్ ఒక లీడర్ గా క్రేజ్ వచ్చింది. కానీ మహేష్ బాబు కేవలం సినిమాల ద్వారా ఆ రేంజ్ ని సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాలను తమిళం లో విజయ్, కన్నడ లో పునీత్ రాజ్ కుమార్, దర్షన్..బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ రీమేక్స్ చేసారు. ఆ కారణం చేత మహేష్ బాబు కి ఎప్పటి నుండో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది.

    మహేష్ బాబు క్రేజ్ కేవలం ఇండియా వరకే పరిమితం కాలేదు. హాలీవుడ్ వరకు ఎగబాకింది. రీసెంట్ గానే ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ నిర్మించిన ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రం తెలుగు వెర్షన్ కి వాయిస్ ఓవర్ అందించాల్సిందిగా స్వయంగా మహేష్ ఇంటికొచ్చి కోరిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కేవలం మహేష్ డబ్బింగ్ చెప్పడం వల్ల తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. అయితే సినిమాకి ముందే మహేష్ బాబు కి మరో ఆఫర్ వచ్చింది. కానీ ఆయన నిర్మొహమాటం నో చెప్పేసాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘థోర్’ చిత్ర హీరో క్రిస్ ఎవాన్స్, అన్నా డే ఆర్మాస్ హీరో హీరోయిన్లు గా నటించిన ‘ది గ్రే మ్యాన్’ చిత్రం లో మహేష్ బాబు ని ఒక కీలక పాత్ర పోషించాల్సిందిగా ఆ చిత్ర దర్శకుడు ‘ఆంటోనీ రుస్సో’ కోరాడట.

    కానీ మహేష్ బాబు నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాడట. ఆ తర్వాత ఆ క్యారక్టర్ ని తమిళ హీరో ధనుష్ చేసాడు. ఈ పాత్రకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మహేష్ ఈ క్యారక్టర్ ని చేయకపోవడానికి ప్రధాన కారణం, ఆయన నేరుగా లీడ్ రోల్ ద్వారా హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాలనే ఉద్దేశ్యం ఉండడం వల్లే. ప్రస్తుతం ఆయన రాజమౌళి తో చేయబోతున్న సినిమా పాన్ ఇండియన్ సినిమా కాదు. ఇంటర్నేషనల్ సినిమా, ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కుతుంది. #RRR చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ మరియు అక్కడి దర్శక నిర్మాతల ప్రశంసలను అందుకున్న రాజమౌళి, మన ఇండస్ట్రీ ఆస్కార్ అవార్డుని కూడా తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో చేయబోతున్న సినిమాతో శాశ్వతంగా మన తెలుగు జెండా ని హాలీవుడ్ గడ్డ పై నాటేందుకు సిద్ధం అవుతున్నాడు రాజమౌళి.