Geetha character in OG: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ 1 బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం ఓజీ(They Call Him OG). భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకొని, ఫుల్ రన్ లో 316 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా అన్ని విధాలుగా ఆడియన్స్ ని అలరించి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సరికొత్త నూతనోత్సాహాన్ని నింపింది ఈ చిత్రం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కేవలం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాత్రమే కాదు, ఇందులోని నటీనటులు కూడా ఒక ముఖ్య కారణం. ముఖ్యంగా గీత క్యారక్టర్ పోషించిన శ్రేయ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి.
శ్రేయా రెడ్డి తన కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ని చేస్తూ వచ్చింది. స్ట్రాంగ్ లేడీ క్యారెక్టర్ అంటే మనకి గుర్తుకొచ్చే మొదటిపేరు శ్రేయా రెడ్డి. అందుకే డైరెక్టర్ సుజిత్ ఆమెని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు. ఎప్పటి లాగానే తనకు ఇచ్చిన పవర్ ఫుల్ క్యారక్టర్ ని డైరెక్టర్ ఊహించిన దానికంటే అద్భుతంగా చేసి ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈమె కంటే ముందు డైరెక్టర్ సుజిత్ ఆ క్యారక్టర్ కోసం వేరే హీరోయిన్ తో చేయించాలని అనుకున్నాడట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సీనియర్ నటి టబు. తెలుగు, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టబు అయితే ఈ పాత్ర వేరే లెవెల్ కి వెళ్తుందని నమ్మి డైరెక్టర్ ఆమెని సంప్రదించారట.
ఆమె ఈ చిత్రం చేయడానికి సిద్దమే కానీ, నిర్మాతలను అడిగిన రెమ్యూనరేషన్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. దాదాపుగా 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఆమె డిమాండ్ చేసిందట. సినిమాలో ముఖ్యమైన క్యారక్టర్, ఎక్కువ నిడివి కూడా ఉండడం తో ఆమె ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, అందుకు నిర్మాతలు అంగీకరించకపోవడం తో ఈ చిత్రం నుండి తప్పుకుందని అంటున్నారు. టబు తర్వాత రమ్య కృష్ణ ని కూడా సంప్రదించారట, ఆమె కూడా దాదాపుగా 8 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసింది. ఇక చివరికి శ్రేయా రెడ్డి ని సంప్రదించడం, ఆమె కేవలం రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కి ఒప్పుకొని ఈ సినిమా చేయడం వంటివి జరిగాయి. ఫలితం ఈరోజు మనమంతా చూస్తున్నాం. ఈమె క్యారక్టర్ త్వరలో రాబోయే ఓజీ 2 , ఓజీ 3 చిత్రాల్లో కూడా చూడొచ్చు.