Mahesh Babu: మన సౌత్ లో జనాలు హీరోలను అభిమానించేంత ఏ రాష్ట్రంలోనూ, ఏ దేశంలోనూ అభిమానించరు. ఇక్కడ స్టార్ హీరోలు గా, హీరోయిన్లు గా ఎదగడం పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం గా భావించవచ్చు. అంత గొప్ప ఇండస్ట్రీ ఇది. అభిమానులు తమ సొంత ఇంట్లో మనిషి లాగా హీరోలను భావిస్తుంటారు. అలాంటి అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు(Superstar Mahesh Babu) కెరీర్ ప్రారంభంలోనే నటనలో ఎంతో గొప్ప పరిణీతి చూపించాడు. ఆ తర్వాత రకరకాల జానర్స్ తో విలక్షణమైన నటన చూపుతూ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు రాజమౌళి(SS Rajamouli) తో చేస్తున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం తో యూనివర్సల్ సూపర్ స్టార్ గా మారనున్నాడు. ఇదంతా పక్కన పెడితే అభిమానులు మహేష్ బాబు కోసం చేసిన ఒక చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు కారు అయినటువంటి PVNR ఎక్స్ ప్రెస్ వేపై స్పీడ్ లిమిట్ దాటడం తో పోలీసులు రెండు సార్లు ఆ కారుపై ఫైన్లు విధించారు. గత నెల నాల్గవ తేదీన ఒకసారి, అదే విధంగా 15వ తేదీన మరోసారి ఇలాగే ఓవర్ స్పీడ్ చలాన్ పడింది. అయితే వారణాసి మూవీ ఈవెంట్ నేపథ్యం లో మహేష్ కారు పై ఉన్న చలాన్లను గమనించిన ఒక మహేష్ అభిమాని, 2070 రూపాయిలు గల చలాన్ బిల్లులను చెల్లించి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. తానూ ఎంతగానో అభిమానించే ఒక సూపర్ స్టార్ కారు కి చలాన్ చెల్లించినందుకు ఆ అభిమాని ఎంతలా ఆనందపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. గతం లో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కూడా అభిమానులు ఇలాగే చేశారు.
ఇక వారణాసి మూవీ విషయానికి వస్తే, నిన్న రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ సినిమా ఈవెంట్ ని మహేష్ ఫ్యాన్స్, మరియు మూవీ లవర్స్ జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా ‘వరల్డ్ ఆఫ్ వారణాసి’ వీడియో అయితే అందరికీ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. రాజమౌళి ఈ వీడియో లో చూపించినట్టుగా తన విజన్ కి తగ్గట్టు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే మాత్రం వెండితెర పై మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన వాడు అవుతాడు. రికార్డ్స్ ఎలాగో వస్తాయి, కానీ ఇలాంటి సినిమాలు చరిత్ర లో చిరస్థాయిగా ఎప్పటికీ అలా మిగిలిపోతాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజమౌళి ఈ క్రేజీ మూవీ తో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడు అనేది.