Teja Sajja Next Movie Details: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నా నటుడు తేజ సజ్జ…ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలైనప్పటికి పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో హనుమాన్ దేవుడిని వాడుకొని మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక మిరాయి సినిమాలో సైతం శ్రీరాముడి పేరు చెప్పి సూపర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుండటంతో నెక్స్ట్ తను మరో దేవుడి సినిమాని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. పరశురాముడి మీద వస్తున్న ఒక సినిమాలో తను డిఫరెంట్ పాత్రలో చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఇక తేజ సజ్జ దేవుళ్ళ సినిమాలను నమ్ముకునే సక్సెస్ ని సాధిస్తున్నాడు అనే ఒక బ్రాండ్ అయితే పడిపోతోంది. ఇకమీదట ఆయనతో సినిమాలు చేసే దర్శకులు సైతం ఇలాంటి సబ్జెక్టులతోనే తన దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంది…కాబట్టి ఇకమీదటైనా ఆయన తన పంథా ను మార్చుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితేనే అతనికి ఎక్కువ రోజులపాటు కెరియర్ అయితే ఉంటుంది.
లేకపోతే మాత్రం ఆయన కెరియర్ ప్రమాదంలో పడిపోయే అవకాశం అయితే ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఒక జానర్ కి ఫిక్స్ అయ్యి హీరోలు సినిమాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అన్ని రకా సినిమాలు చేస్తు ప్రేక్షకులను మెప్పించినప్పుడే వాళ్ళు స్టార్లుగా ఎదుగుతారు.
అంతకు మించిన స్టార్ డమ్ ను సంపాదించుకుంటూ ప్రేక్షకుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు… తేజ సజ్జ ఇకమీదట రాబోతున్న సినిమాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…చూడాలి మరి ఇక మీదట ఆయన నుంచి వచ్చే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది…