Deepika Padukone Exit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు ప్రస్తుతం ఒక్కతాటి మీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో తెలుగు సినిమా హవాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు తెరలేపిన ప్రభాస్ అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘పుష్ప 2’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ‘స్పిరిట్’ సినిమా విషయంలో దీపికా పదుకొనె ను మొదట హీరోయిన్ గా తీసుకొని ఆ తర్వాత ఆమెను తీసేసిన విషయం మనకు తెలిసిందే… రీసెంట్ గా వైజయంతి మూవీస్ వాళ్లు సైతం ‘కల్కి 2’ సినిమా నుంచి దీపికా పదుకొనేని తీసేస్తున్నాం అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు…
ఇక ఈ రెండు సినిమాలు నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆమె పెట్టే కండిషన్స్ అలాగే ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్, ఆమె వర్కింగ్ అవర్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో దీపిక పదుకొనె ను మొదట హీరోయిన్ గా తీసుకున్నప్పటికి ఇప్పుడు ఆ సినిమా నుంచి దీపికను తీసేస్తున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
కారణం ఏంటి అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ లేకుండా ఇతర విషయాల్లో ఓవర్ ఆక్టివిటీ ని చూపిస్తూ తను పెట్టిన కండిషన్స్ అన్ని అప్లై అవ్వాలి అనే ధోరణిలో దీపిక పదుకొనే వ్యవహరిస్తుంది. అందువల్లే అలాంటి వారిని సినిమాల్లో తీసుకోవడం కంటే పక్కన పెట్టడమే బెటర్ అని తెలుగు సినిమా హీరోలు, దర్శకులు అనుకుంటున్నాట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఒకరి తర్వాత ఒకరు తమ సినిమాల నుంచి దీపిక ను తీసేస్తున్నారు.
మరి ఇలాంటి క్రమంలో ఆమె కెరీర్ అనేది చాలా వరకు ఇబ్బందుల్లో పడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి తను ఇలాంటి మొండి వైఖరిని అనుసరించకుండా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయి ముందుకు సాగితే తప్ప దీపికా పదుకొనే కెరీర్ ఇకమీదట నిలబడలేదు అని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…