Vijay leaving politics: ఇటీవలే తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) కరూర్(Karur Incident) రాజకీయ సభలో 40 మందికి పైగా తొక్కిసలాట ఘటనలో చనిపోవడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చనిపోయిన వారిలో మహిళలు ఉన్నారు, పసి బిడ్డలు కూడా ఉన్నారు. కరూర్ సభ ఉదయం పది గంటలకు షెడ్యూల్ చేస్తే, విజయ్ సాయంత్రం 7 గంటలకు వచ్చాడు. కేవలం పది వేల మంది మాత్రమే ఈ కూడలి రోడ్లలో సరిపోతారు. కానీ విజయ్ ఆలస్యం చేయడం తో ఏకంగా 28 వేల మంది చేరారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడం తో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో తప్పు ఎవరిదీ అనేది కాసేపు పక్కన పెడితే, హీరో విజయ్ పొలిటికల్ కెరీర్ మాత్రం ప్రమాదం లో పడింది అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన జనాలను ఎదురుకునే పరిస్థితిలో కూడా లేడు. అలాంటి సందిగ్ద పరిస్థితి ఏర్పడింది.
ఇదంతా పక్కన పెడితే ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్ లో మృతుల కుటుంబాలను, అదే విధంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు TVK పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం. ఈ ఘటన జరిగిన కాసేపటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కరూర్ కి విచ్చేసి బాధితులను పరామర్శించారు. ఇందులో తప్పు ఎవరిదీ అని మీడియా అడిగిన ప్రశ్నకు, ఇది రాజకీయ కోణంతో చూడాల్సిన విషయం కాదు, దీని పై ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు అని చెప్పుకొచ్చాడు. కానీ విజయ్ పార్టీ మాత్రం దీనిని రాజకీయం కోసం ఉపయోగించుకుంటుంది. ప్రభుత్వ లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగింది అంటూ TVK పార్టీ కి చెందిన వాళ్ళు మీడియా సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు. ఇది చూసి విజయ్ అభిమానులు కూడా కోపగించుకున్నారు. జరిగింది చిన్న సంఘటన కాదు, అక్షరాలా 40 మంది ప్రాణాలు పోయాయి. ఇలాంటి పరిస్థితిలో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అంటూ సోషల్ మీడియా లో మండిపడ్డారు.
ఇదంతా చూస్తుంటే విజయ్ అసలు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తాడా?, అసలు ఆయన సభలకు ఇక ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా లేదా?, ఒకవేళ జనాల ముందుకొస్తే, జరిగిన ఆ దారుణమైన సంఘటన గురించి ఏమి చెప్తాడు?, జనాలు ఇతన్ని క్షమిస్తారా అనేది ఆసక్తికరమైన అంశాలు. ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టీ చూస్తుంటే విజయ్ కొఞ్చకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట. అందుకే ఆయన తన పర్యటన ని ముగించుకొని చెన్నై కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఏమి చెయ్యాలో నిర్ణయం తీసుకుంటాడని తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. చూడాలి మరి విజయ్ ఈ కష్టసమయాన్ని ఎదురుకొని మళ్లీ ఎలా కం బ్యాక్ ఇస్తాడు అనేది.