Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) మంచి ఆసక్తికరంగా మాత్రమే కాదు, అద్భుతమైన ట్విస్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఈ వారం ఏకంగా పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అంతా అనుకున్నారు. దీంతో ఆడియన్స్ తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేయడం మొదలు పెట్టారు. కానీ ఈ వారం జరిపిన ఇమ్మ్యూనిటీ టాస్కులలో కంటెస్టెంట్స్ ఏ రేంజ్ లో పోటీ పడి ఆడారో మనమంతా చూశాము. వీరిలో భరణి, దివ్య మరియు పవన్ కళ్యాణ్ లు నిన్నటి ఎపిసోడ్ లో గెలిచి నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు. ఇక ఈరోజు జరగబోయే టాస్కులలో ఎవరో ఒకరు నామినేషన్స్ నుండి బయట పడుతారు. సాధ్యమైనంత వరకు తనూజ సేవ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు హౌస్ మేట్స్ సపోర్ట్ చాలా గట్టిగా ఉంది.
ఒకవేళ ఆమె సేవ్ అయితే ఇక నామినేషన్స్ లో సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, డిమోన్ పవన్ మరియు దమ్ము శ్రీజ మిగిలి ఉంటారు. వీరిలో సుమన్ శెట్టి ని ఎలిమినేట్ చేసి బయటకు పంపే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. సుమన్ శెట్టి నుండి పెద్దగా ఎలాంటి కంటెంట్ రావడం లేదని, పైగా ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండడంతో ఆయన్ని ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేసి పంపే ప్రయత్నాలు బిగ్ బాస్ టీం చేస్తుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. సుమన్ శెట్టి తో పాటు ఫ్లోరా షైనీ ని కూడా డబుల్ ఎలిమినేషన్ లో పంపే అవకాశాలు ఉన్నాయట. ఈమె నుండి కూడా ఎలాంటి కంటెంట్ రావడం లేదు. పైగా ఈమె రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్కువ అట. అందుకే వీళ్ళిద్దరిని ఈ వీకెండ్ లో బయటకు సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.
ఒకవేళ సుమన్ శెట్టి ని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ టీం ఘోరమైన నెగిటివిటీ ని ఎదురుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు సోషల్ మీడియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో సుమన్ శెట్టి పై సానుభూతి మామూలు రేంజ్ లో లేదు. ఆయన పై వచ్చే మీమ్స్ కి వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తున్నాయి. ఇలాంటి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే ఆడియన్స్ తట్టుకోగలరా?, సుమన్ శెట్టి నుండి కంటెంట్ రాకపోవచ్చు, కానీ ఆయన ఈ షో ద్వారా అమాయకుడు, ఒక మంచి మనిషి గా పేరు తెచ్చుకున్నాడు. దానికి తోడు తనకు స్కోప్ దొరికినప్పుడల్లా టాస్కులు ఆడడంలో కానీ, ఎంటర్టైన్మెంట్ అందించడం లో కానీ ఎక్కడా తగ్గడం లేదు, అలాంటి సుమన్ శెట్టి ని ఎలిమినేట్ చేస్తే సీజన్ మొత్తంపై ప్రభావం పడే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.