Diwali 2025 Movies: పండగ వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి మొదలవుతోంది… వారం రోజుల క్రితమే దసర పండుగ వచ్చి పోయింది. ఇక ఇంతలోపే దీపావళి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పండక్కి ఏకంగా నాలుగు సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇక అన్ని కూడా చిన్న సినిమాలే కావడం విశేషం… ఇక ఈ సినిమాలన్నింటిలో ఏ మూవీని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపించకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ‘ఓజీ’, ‘ కాంతార చాప్టర్ వన్ ‘ లాంటి పెద్ద సినిమాలను చూసిన జనాలు ఇప్పుడు చిన్న సినిమాని చూడడానికి థియేటర్ కి వస్తారా? ఒకవేళ వచ్చిన ఫ్యామిలీతో రాగలిగే సాహసం చేస్తారా? అనేదే అందరి మైండ్ లో మెదులుతోంది. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు వస్తున్న సినిమాలు చూడాలి అనుకున్నప్పటికి ఏ సినిమా సక్సెస్ టాక్ వచ్చిందో ఆ సినిమాను మాత్రమే చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో ప్రేక్షకులు కొంత వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో సక్సెస్ టాక్ వచ్చిన సినిమానే చూద్దాం అనే ధోరణిలో ఆడియన్స్ ఉన్నారు. ఇక 16వ తేదీన మిత్రమండలి, 17వ తేదీన తెలుసు కదా, డ్యూడ్, 18 వ తేదీన కే ర్యాంప్ సినిమాలు వస్తున్నాయి…
మిత్రమండలి సినిమా ప్యూర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో తెలుసు కదా, డ్యూడ్ సినిమాల మధ్య బీభత్సమైన పోటీ ఉండబోతోంది. ఈ రెండు సినిమాల ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి అనే దానిమీదనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది…18వ తేదీన వస్తున్న కే ర్యాంప్ సినిమా కిరణ్ అబ్బవరం చేసిన క మూవీ తర్వాత వస్తోంది. కాబట్టి ఈ మూవీ మీద ఒక మోస్తారు అంచనాలైతే ఉన్నాయి.
అయితే ఈ సినిమాలో యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా సన్నివేశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి… ఇక ఈ అన్ని సినిమాల్లోకి తెలుసు కదా సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరో కాబట్టి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దీంతోపాటుగా డ్యూడ్ సినిమాకి కూడా ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. కారణం ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు…
ఇక కే ర్యాంప్, మిత్ర మండలి సినిమాలు సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించుకుంటే మాత్రమే ఆ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు… ఒకవేళ పొరపాటున ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, లేదంటే ప్లాప్ అయినా ఆ సినిమాలను పట్టించుకునే అవకాశాలైతే లేవు. ఇక ఈ మూవీస్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరొక వారం రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…