Homeఎంటర్టైన్మెంట్Sukumar story finalized: సుకుమార్ ఇందుకింత లేటు చేస్తున్నాడు..? కథ ఫైనల్ అయిందా..?

Sukumar story finalized: సుకుమార్ ఇందుకింత లేటు చేస్తున్నాడు..? కథ ఫైనల్ అయిందా..?

Sukumar story finalized: ఇండియాలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుకుమార్ అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు చేసిన ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే సినిమా కథకి సంబంధించిన పూర్తి వర్క్ ను చేసే పనిలో బిజీగా ఉన్నాడు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమాని తీయాలనే ప్రయత్నంలో సుకుమారైతే ఉన్నాడు. కాబట్టి అతని స్పాన్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే రిస్కు కూడా పెరుగుతుంది. ఇక భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ తో సినిమాను చేసి ఆ సినిమాని ఇండస్ట్రీ హిట్టుగా మలచాలనే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాను తీసి ఇండస్ట్రీ హిట్ గా మలచగలడా అనే డౌట్ అందరిలో కలుగుతుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. కానీ ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమాని తెరకెక్కించడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి.

మొత్తానికైతే రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పూర్తి బౌండెడ్ స్క్రిప్ ని రెడీ చేసిన తర్వాతే సుకుమార్ సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఆయన ఎక్కడా కూడా సినిమాకి సంబంధించిన ఏ హింటు ఇవ్వకుండా తన పూర్తి వర్క్ ని ఫినిష్ చేసుకుంటున్నాడు.

మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ని తొందర్లోనే ఇస్తానని సుకుమార్ తో చెబుతున్నాడు… రంగస్థలం మాదిరిగానే ఈ సినిమా కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందా? లేదంటే ‘వన్ నేనొక్కడినే’ సినిమాల సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించాలని చూస్తున్నాడా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version