Bigg Boss Telugu 8: నిఖిల్ ని దారుణంగా టార్గెట్ చేసిన హౌస్ మేట్స్..సరైన పాయింట్స్ చెప్పలేక అడ్డంగా దొరికిపోయిన విష్ణుప్రియ!

రెండో నామినేషన్ కి ఎవ్వరూ దొరకలేదు కాబట్టి, నిఖిల్ మీద వేస్తే సరిపోతుంది, ఎలాగో వీకెండ్ ఎపిసోడ్ లో అందరూ 'నిన్న హీరో..నేడు జీరో' అనే ట్యాగ్ ఇచ్చారు కదా, ఆ కారణం తో వెయ్యొచ్చు అని వేసింది. కానీ నిఖిల్ విష్ణు ప్రియ కి వేసిన ప్రతీ కౌంటర్ కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు.

Written By: Vicky, Updated On : October 22, 2024 8:54 am

Bigg Boss Telugu 8(143)

Follow us on

Bigg Boss Telugu 8:  ఈ వారం జరిగిన నామినేషన్స్ లో ఒక్కరు కూడా సరైన పాయింట్స్ తో నామినేషన్ చేయలేదని , బిగ్ బాస్ హిస్టరీ లోనే అతి చెత్త నామినేషన్ ఎపిసోడ్ ఇదేనని నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్న మాట. కంటెస్టెంట్స్ అందరూ నిఖిల్, ప్రేరణ ని సాఫ్ట్ టార్గెట్ చేసి నామినేట్ చేసారని, సరైన కారణాలు లేవని మండిపడుతున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా నిఖిల్ గేమ్ బాగా తగ్గిపోయిందని, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ లో కేవలం తన సిగెరెట్ తాగే అలవాటు కోసం ఒక పాయింట్ ని అవలీలగా ఇచ్చేయడం మాకు నచ్చలేదు అంటూ కంటెస్టెంట్స్ తెగ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక విష్ణు ప్రియకి అయితే ఎవరి మీద నామినేషన్స్ పాయింట్స్ దొరకకపోవడంతో నిఖిల్, ప్రేరణ మీద నామినేషన్స్ వేసింది. ప్రేరణ అంటే ఈమెకి మొదటి నుండి అసూయ, ఎదో ఒక కారణం తో నామినేట్ చేయాలని చేసింది.

ఇక రెండో నామినేషన్ కి ఎవ్వరూ దొరకలేదు కాబట్టి, నిఖిల్ మీద వేస్తే సరిపోతుంది, ఎలాగో వీకెండ్ ఎపిసోడ్ లో అందరూ ‘నిన్న హీరో..నేడు జీరో’ అనే ట్యాగ్ ఇచ్చారు కదా, ఆ కారణం తో వెయ్యొచ్చు అని వేసింది. కానీ నిఖిల్ విష్ణు ప్రియ కి వేసిన ప్రతీ కౌంటర్ కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. విష్ణు ప్రియ కి నోటి నుండి మాట కూడా రాలేదు. ముందుగా ఆమె కారణం చెప్తూ ‘నువ్వు నీ అలవాటు కోసం ఒక పాయింట్ ఆరోజు ఊరికినే ఇచ్చేయడం నాకు నచ్చలేదు. వాష్ రూమ్ లో కేవలం ఒక్క పాయింట్ కోసం అంత గొడవ పడ్డావు, అలాంటిది నువ్వు కేవలం లైటర్ కోసం పాయింట్ ఇవ్వడం ఏమిటి?’ అంటూ నామినేట్ చేసింది. కేవలం విష్ణు ప్రియ ఒక్కటే కాదు, హౌస్ లో ఆయనకీ 5 నామినేషన్స్ పడితే, 5 మంది ఇదే కారణం చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా నిఖిల్ ఆట బాగా తగ్గిపోయింది అనే మరో కారణం కూడా చెప్పారు. ఓజీ క్లాన్ ని లీడ్ చేస్తూ, వాళ్ళను రక్షించుకుంటూ, ప్రతీ చిన్న పాయింట్ కోసం దెబ్బలు తాకించుకొని, ఒక రేంజ్ లో పోరాడింది నిఖిల్ మాత్రమే, అందులో ఎలాంటి సందేహం లేదు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక, ఓజీ క్లాన్ మొత్తాన్ని తన భుజస్కందాలపై మోసి గెలిపించేందుకు ఎంతో ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నానికి నిఖిల్ కి దక్కిన గౌరవం ఈ నామినేషన్స్. వాస్తవానికి బిగ్ బాస్ టీం కూడా నిఖిల్ గేమ్ ఆడడం లేదు అన్నట్టే ప్రొజెక్ట్ చేసి, కంటెస్టెంట్స్ కి ఆయన మీద నామినేషన్స్ పాయింట్స్ కావాలని ఇస్తున్నారు. అసలు గత వారం లో నిఖిల్ లేకపోతే టాస్క్ ఉండేదా?, అంత రసవత్తరంగా సాగేదా?, నిఖిల్ సిగరెట్ కోసం ఒక్క పాయింట్ ఇచ్చారని అంత టార్గెట్ చేసారు, నభీల్ తన నిర్లక్ష్యంతో ఊరికినే రెండు పాయింట్స్ ఇచ్చేసాడు, అతని ఆట ముందు వారాలతో పోలిస్తే బాగా తగ్గిపోయింది, కానీ నభీల్ ని మాత్రం ఎవ్వరూ టార్గెట్ చెయ్యలేదు, ఇదెక్కడి న్యాయమో బిగ్ బాస్ కి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అర్థం అవ్వాలి.