https://oktelugu.com/

భారత్ బంద్ లో ఉద్రిక్తత.. ఒకరిపై చేయిచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల తీసుకొచ్చిన మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. Also Read: బీజేపీ ‘మిషన్-2023’ స్టార్ట్ : కాంగ్రెస్, టీఆర్ఎస్ టార్గెట్? రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్.. టీడీపీ తదితర పార్టీలు సైతం భారత్ బంద్ కు నిన్ననే మద్దతు తెలిపాయి. నేటి బంద్ లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 8, 2020 / 11:50 AM IST
    Follow us on

    కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల తీసుకొచ్చిన మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

    Also Read: బీజేపీ ‘మిషన్-2023’ స్టార్ట్ : కాంగ్రెస్, టీఆర్ఎస్ టార్గెట్?

    రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్.. టీడీపీ తదితర పార్టీలు సైతం భారత్ బంద్ కు నిన్ననే మద్దతు తెలిపాయి. నేటి బంద్ లో టీఆర్ఎస్.. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్ లో పాల్గొని విజయవంతం చేస్తున్నాయి.

    భారత్ బంద్ నేపథ్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు.. ర్యాలీ చేపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో రైల్ రోకోలు నిర్వహిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ ప్రభావం కనిపిస్తోంది.

    ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలను మూసేశారు. రోడ్లోపై రాస్తారోకోలతో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఉషా ముళ్ళపూడి వద్ద చేపడుతున్న బంద్ ఉద్రిక్తంగా మారింది.

    Also Read:నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ కు చావో.. రేవో..!

    ఈ ప్రాంతంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆయనకు ఎదురు తిరిగి మాట్లాడటంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కార్యకర్తలు అతడిని కొట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని అతడిని అక్కడి నుంచి పంపించారు.

    నేడు కొనసాగుతున్న భారత్ బంద్ ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు కొనసాగనుందని రైతు సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతానికి చెదురుముదురు సంఘటనలు మినహా భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్