https://oktelugu.com/

Janhvi Kapoor: పెళ్లి కాకుండానే శ్రీదేవి కూతురు జాన్వి ప్రెగ్నెంట్ అయ్యిందా అసలు నిజం ఇదే

జాన్వీ కపూర్ గురించి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు థంబ్ నెయిల్స్ సృష్టించి మరీ కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అందరూ షాక్ కు గురవ్వడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? జాన్వి కపూర్ సీక్రెట్ గా గర్భాన్ని తొలగించుకుంది అనే టాక్ వినిపిస్తుంది.

Written By: , Updated On : October 11, 2023 / 05:26 PM IST
Janhvi Kapoor

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పేరుతో కంటే అందాల తార శ్రీదేవి కూతురిగానే జాన్వీ ఎక్కువగా ఫేమస్ అయింది. ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమాలో జాన్వీ మెరవనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కేవలం ఎన్టీఆర్ సినిమాలో మాత్రమే కాదు మరో టాప్ టాలీవుడ్ హీరోల సినిమాల్లో కూడా అవకాశం వచ్చినట్టు టాక్. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ గురించి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు థంబ్ నెయిల్స్ సృష్టించి మరీ కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అందరూ షాక్ కు గురవ్వడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? జాన్వి కపూర్ సీక్రెట్ గా గర్భాన్ని తొలగించుకుంది అనే టాక్ వినిపిస్తుంది.

ఈ పుకార్లు కాస్త బోనీ కపూర్ కంట పడడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి అంటూ హెచ్చరించారు. అంతే కాదు తమ కూతుర్ల గురించి ఇలాంటి చెత్త వార్తలు, తప్పుడు వార్తలు రాస్తే పరిణామాలు మరో విధంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అలాగే జాన్వీ కపూర్ పెళ్లికి ముందే శ్రీదేవి కి పుట్టింది అనే విషయంలో కూడా బోని కపూర్ క్లారిటీ ఇచ్చారు. అయితే బోనీ కపూర్ ఈ వార్తలపై స్పందించడంతో జాన్వీ ప్రెగ్నెంట్ కాదనే విషయం క్లారిటీ వచ్చేసింది.