https://oktelugu.com/

Game Changer: గేమ్ చేంజర్ మూవీతో సక్సెస్ సాధించడానికి శంకర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా..? అది ఎంత వరకు ఫలిస్తుంది…

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వాళ్లలో శంకర్ ఒకరు. ఈయన చేసిన సినిమాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 10, 2024 / 06:04 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ని ఏక ఛత్రాదిపత్యంతో ఏలుతున్నాడు. ఇక ఎప్పటికప్పుడు తన అభిమానుల్లో గుర్తింపును చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఆయన తనయుడు అయిన రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా ఎదగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని చెబుతూ సంతోషపడుతూ ఉంటారు… ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో రామ్ చరణ్ ఎలాంటి సబ్జెక్టులను సినిమాలుగా చేస్తే బాగుంటుంది అనే విషయం లో చిరంజీవి పలు రకాల కథలను సెలెక్ట్ చేసి మరి చరణ్ చేత చేయించేవాడు. కానీ ఇప్పుడు చరణ్ కి సంబంధించిన సబ్జెక్టులను ఆయనే ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ సినిమాను కూడా చాలా ఇష్టపడి మరి చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి శంకర్ అసలు ఫామ్ లో లేడనే విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమాతో మరోసారి ఆయన భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు… మరి గేమ్ చేంజర్ సినిమాని ఎలా సక్సెస్ చేస్తాడు అనేది చూడడానికే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లను అందించారు.అలాంటి ఆయన ఇప్పుడు మాత్రం ఒక్క హిట్ కొట్టడానికి తడబడుతూ ఉండటం నిజంగా అతని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తుంది…

    ఇక దానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఆయన ఈ జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలను చేయడంలో ఫెయిల్ అవుతున్నాడా అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ‘కార్తీక్ సుబ్బరాజు’ గేమ్ చేంజర్ సినిమాకి కథను అందించాడు…ఇక ఈ కథతో శంకర్ ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడా లేదా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న…

    అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరు కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారు అనే సమాచారమైతే అందుతుంది. మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమాని సక్సెస్ చేయడానికి శంకర్ అహర్నిశలు కష్టపడుతూ కొన్ని మాస్టర్ ప్లాన్స్ ను వేస్తున్నారట…
    అందులో చిరంజీవి, రజనీకాంత్ లు కూడా భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ చేస్తుండటం విశేషం…ఈ సినిమా తర్వాత భారతీయుడు 3 సినిమాను చేయడానికి శంకర్ ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. చూడాలి మరి వరుస సక్సెస్ లను అందుకొని శంకర్ మళ్ళీ స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడా లేదా అనేది…