Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీకి గత కొన్ని రోజుల నుంచి ఒక్క సక్సెస్ కూడా రావడం లేదు. సౌత్ నుంచి వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటే బాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను అలరించలేక చతికీల బడిపోతున్నాయి. ఇక వాళ్ల సినిమాలు తెలుగులో సక్సెస్ అవుతున్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే వాళ్ల సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించలేకపోవడం విశేషము… ఒకప్పుడు బాలీవుడ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ సినిమాలను బరిలోకి దింపేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మొత్తం మారిపోయింది. వాళ్లు ఒక్క సక్సెస్ కొట్టడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక అక్కడున్న స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఎవరికివారు సక్సెస్ లను అందుకోవడానికి చాలా ప్రయత్నం చేసిన కూడా సక్సెస్ మాత్రం తగ్గడం లేదు. ఇక ఒకప్పుడు సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ వచ్చిన అక్షయ్ కుమార్ సైతం వరుస ప్లాప్ లతో సతమతమవుతూ సక్సెస్ లను ఇవ్వలేక చేతులెత్తేసాడు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడుకునే నాధుడు ఎవరు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసకైతే నెలకొంది. ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 15 వ తేదీన బాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. మరి అందులో ఏ సినిమా సక్సెస్ ని సాధించి మళ్లీ బాలీవుడ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…
ఇక ముఖ్యంగా శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో చేస్తున్న ‘స్ట్రీ 2’ సినిమా ఆగస్టు15వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇంకా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి…
ఇక అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను లీడ్ రోల్ లో నటిస్తున్న ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాకి ‘ముదస్సర్ అజీజ్’ దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషము…ఇక ఈ సినిమాతో అయిన అక్షయ్ కుమార్ సక్సెస్ ని సాధిస్తాడా లేదంటే వరుసగా తన 14వ డిజాస్టర్ ని కూడా అందుకుంటాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక జాన్ అబ్రహం హీరోగా శర్వారీ వాగ్ హీరోయిన్ గా నటిస్తున్న వేద సినిమా కూడా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇక నిఖిల్ అద్వానీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీద బాలీవుడ్ జనాల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి…ఇక ఈ మూడు సినిమాలు భారీ అంచనాలతో ఆగస్టు 15వ తేదీన బరిలోకి దిగుతున్నాయి. ఇక వీటిలో బాలీవుడ్ పరువు నిలబెట్టే సినిమా ఏది అనేది తెలియాల్సి ఉంది…