Spirit movie updates: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఆయన స్టార్ డైరెక్టర్లుగా ఎదిగాడు. బాహుబలి (Bahubali) సినిమాతో రాజమౌళి(Rajamouli) భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక దాంతో పాన్ ఇండియా సినిమాలను చేసి భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టొచ్చనే ఉద్దేశ్యంతో మన స్టార్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో సక్సెస్ ను సాధించిన సందీప్ రెడ్డివంగా మొదటి సినిమాతోనే ఆయన చేసిన మ్యాజిక్ చాలావరకు వర్కౌట్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే సెకండ్ సినిమా అయిన కబీర్ సింగ్ తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. ఇక రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ (Animal) మూవీ భారీ విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ఈ సినిమా లాంగ్ రన్ లో 900 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి సందీప్ రెడ్డి వంగ ను ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా నిలిపింది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చాలావరకు బోల్డ్ సీన్స్ ఉండటమే కాకుండా వయోలెన్స్ కూడా పీక్ స్టేజ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మరి ఇప్పటివరకు ప్రభాస్ ఐతే ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించలేదు. మరి ఈ సినిమాలో సందీప్ ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడు. తద్వారా ఈ సినిమాతో ప్రభాస్ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాడా?
Also Read: మహేష్ బాబు – రాజమౌళి మూవీలో ఆ ఒక్క ఫైట్ కోసం అన్ని డబ్బులు పెడుతున్నారా..?