RGV in OG Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి అటు హీరోలు, ఇటు దర్శకులు విపరీతమైన కష్టాలైతే పడుతుంటారు. కారణం ఏంటి అంటే అల్టిమేట్ గా సినిమా సక్సెస్ అయితేనే వాళ్లకు మార్కెట్ అనేది క్రియేట్ అవుతోంది. తద్వారా హీరోకి దర్శకుడికి మరొక సినిమా చేసే అవకాశం అయితే దక్కుతోంది. కాబట్టి ఇక్కడ సక్సెస్ అనేది మాత్రమే అల్టిమేట్ గా చూస్తూ ఉంటారు. ప్లాపు ల్లో ఉన్న వారిని ఎవరు పట్టించుకోరు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం వరుస సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. ఒకవైపు డిప్యూటీ సీఎం గా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తూనే, మరోవైపు అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సుజీత్ దర్శకత్వంలో ఆయన చేసిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రురిలైజ్ ఈవెంట్ జరిగింది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో ‘రామ్ గోపాల్ వర్మ’ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ కొన్ని ట్వీట్స్ అయితే చేస్తూ ఉంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ కూడా చేస్తుంటాడు.
మరి ఇలాంటి సందర్భంలో సుజీత్ మాత్రం అర్జివినీ ఈ సినిమాలో భాగం చేసి పవన్ కళ్యాణ్ ఎదురుగా కొన్ని డైలాగులు కూడా చెప్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆర్జీవీ ఇందులో క్యామియో క్యారెక్టర్ అయినప్పటికి పవన్ కళ్యాణ్ అతన్ని సినిమాలో పెట్టుకోవడానికి ఒప్పుకున్నాడట. మరి రామ్ గోపాల్ వర్మ సైతం పవన్ కళ్యాణ్ తో నటించడానికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆర్జీవి ‘కల్కి’ సినిమాలో కమియో రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఓజీ లో కూడా అదే ఉద్దేశ్యంతో కామియోరోలైతే చేశారట. మరి పవన్ కళ్యాణ్ ఆర్జీవి ఇద్దరు ముఖాముఖిగా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ సీన్లు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశం ఏంటి అనేది తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిని చూపిస్తూ ఉండడం విశేషం…