Anchor Rashmi Gautam: బుల్లితెర టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. గ్లామరస్ యాంకర్ గా బుల్లితెరపై హవా సాగిస్తుంది. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ వెండితెరపై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. బిజీ యాంకర్ గా నెలకు లక్షలు సంపాదిస్తున్న రష్మీ.. ఊహించని విధంగా ఓ చిన్న రేకుల షెడ్డుకు షిఫ్ట్ అయింది.
హైదరాబాద్ లోని తన విలాసవంతమైన ఇంటిని వదిలేసి .. ఓ సాధారణ రేకుల ఇంట్లో రష్మీ ఉంటుందట. ఇది తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. రష్మీ ఒక్కో ఎపిసోడ్ కి రూ. 1.5 నుండి రూ. 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. లక్షలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న రష్మీ .. ఇలా రేకుల షెడ్డులో ఎందుకు ఉంటుంది అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా హైపర్ ఆది ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పుడు రష్మీ ఇల్లు చూద్దాం అని చెప్పిన ఆది స్క్రీన్ పై ఓ రేకుల షెడ్డు వద్ద రష్మీ ఉన్న ఫోటో చూపించాడు. రష్మీ తనకు ఉన్న ఇల్లు అద్దెకు ఇచ్చి, ఇలా రేకుల షెడ్డు కి మారిందని చెప్పాడు. అయితే ఇదంతా కామెడీలో భాగమే. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నవ్వులు పూయించేందుకు ఆది ఈ ప్రయోగం చేశాడు. ఇక ఇంద్రజ పూరి గుడిసెలో ఉంటున్నట్లు .. ఆది స్లమ్ ఏరియా లో నివసిస్తున్నట్లు స్క్రీన్ పై చూపించగానే అందరూ నవ్వేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో కాస్త వైరల్ అవుతుంది.
తాజా ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇందులో ట్రాఫిక్ పోలీస్ గెటప్ లో హైపర్ ఆది నాన్ స్టాప్ పంచులు వేశాడు. ‘ బటర్ ఫ్లై, బటర్ ఫ్లై .. వేర్ ఆర్ యు గోయింగ్ ‘ అంటూ స్కూల్ పిల్లలు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి పై ఆది ఈ సాంగ్ కి టీమ్ తో పెరఫార్మ్ చేశాడు. కాగా హైపర్ ఆది సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు.
Web Title: Is rashmi gautam be in such a position
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com