Homeఎంటర్టైన్మెంట్Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన కి త్వరలోనే కొడుకు పుట్టబోతున్నాడా..? ఆధారాలు...

Ram Charan Upasana: రామ్ చరణ్ – ఉపాసన కి త్వరలోనే కొడుకు పుట్టబోతున్నాడా..? ఆధారాలు ఇవే!

Ram Charan Upasana: రామ్ చరణ్-ఉపాసన పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. 2023 జూన్ 20న ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ప్రసవించారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ కూతురికి క్లిన్ కార అని నామకరణం చేశారు. క్లిన్ కార కడుపులో పడ్డప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో అన్నీ శుభాలే. వాల్తేర్ వీరయ్య తో చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టాడు. రామ్ చరణ్ అమెరికా వేదికగా అనేక గౌరవాలు అందుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఫేమ్ గ్లోబల్ స్థాయికి చేరింది.

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు… ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. ఆస్కార్ వేడుకలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ క్లిన్ కార వచ్చాక మెగా ఫ్యామిలీలో సంతోషం రెట్టింపు అయ్యింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ విషయంలో నిరాశ చెందుతున్నారు. రామ్ చరణ్ కి ఎట్టకేలకు పిల్లలు పుట్టారని సంతోషం వ్యక్తం చేస్తూనే… అబ్బాయి అయితే బాగుండేదని అంటున్నారు.

చిరంజీవి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు కావాలని అంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి పరిశ్రమకు వచ్చి చరిత్ర సృష్టించాడు. ఆయన లెగసీని కొడుకు చరణ్ ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ కి కూడా ఒక కుమారుడు ఉంటే నటవారసత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు అంటున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్-ఉపాసన త్వరలో సెకండ్ చైల్డ్ ని ప్లాన్ చేస్తున్నారట. అబ్బాయి కోసం మరోసారి తల్లిదండ్రులు కానున్నారట.

అయితే కనీసం ఏడాది సమయం తీసుకునే అవకాశం ఉంది. క్లిన్ కార వయసు ఇంకా ఆరు నెలలు మాత్రమే. క్లిన్ కారకు రెండు మూడేళ్లు ప్రాయం వచ్చే వరకు సెకండ్ చైల్డ్ ఆలోచన చేయకపోవచ్చనే మరో వాదన ఉంది. ఇక రాజ్ చరణ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే… దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుండగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

RELATED ARTICLES

Most Popular