SSMB 29 Movie: ఇండియాలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికి రాజమౌళి కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి…ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. దానికి మించి రికార్డులు సైతం బ్రేక్ అవుతుంటాయి…ఇక ఇప్పటివరకు ఎవ్వరు సాధించనటువంటి గొప్ప విజయాలను అతను దక్కించుకున్నాడు. వరుసగా 12 విజయాలతో ఎవర్ గ్రీన్ డైరెక్టర్ గా నిలిచిపోయాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాని ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఈ సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూల్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇక దాంతోపాటుగా రాజమౌళి ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. హీరో వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ లో రాజమౌళి కనిపించబోతున్నాడట…ఈ మూవీలో మహేష్ బాబుకి గన్ ఫైరింగ్ రాజమౌళి నేర్పిస్తాడట.
ఇక ఇదే కనక నిజమైతే రాజమౌళి ఈ సినిమాలో కీలక పాత్రను పోషించినవాడవుతాడు. ఇప్పటికే రాజమౌళి నటన ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలోని ప్రతి పాత్రకి తనే నటించి చూపిస్తుంటాడు.
ఇక చాలా మంది స్టార్ హీరోలు సైతం రాజమౌళి చేసే యాక్టింగ్ లో మనం సగం యాక్టింగ్ చేసిన కూడా మనం గొప్ప ఆర్టిస్టులం అవుతాం అంటూ ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇక మొత్తానికైతే రాజమౌళికి ఉన్న విజన్ కి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి పాన్ వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడా లేదా అనేది…