Dude And Telusu Kada OTT: ఈ దీపావళి కానుకగా విడుదలైన కొత్త సినిమాలు థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్నాయి. కేవలం మిత్రమండలి చిత్రం తర్వాత మిగిలిన సినిమాలన్నీ బాగానే ఆడుతున్నాయి. అందులో ప్రత్యేకించి డ్యూడ్ చిత్రం గురించి మాట్లాడుకోవాలి. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన ఈ సినిమా ఈ దీపావళి సినిమాలను డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) నటించిన ‘తెలుసు కదా'(Telusu Kada Movie) చిత్రం ఒక సెక్షన్ ఆడియన్స్ ని అలరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పెద్దగా వసూళ్లు రావడం లేదు కానీ, ఓవర్సీస్ లో మాత్రం సూపర్ హిట్ దిశగా ఈ చిత్రం అడుగులు వేస్తోంది. ఫుల్ రన్ లో ఓవరాల్ గా డిజాస్టర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కానీ, అర్బన్ సెంటర్స్ లో ఒక వారం రోజుల వరకు డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాలు ఒకే ఓటీటీ సంస్థకు అమ్మడుపోవడం విశేషం.
ఒకే రోజున విడుదలైన ఈ రెండు సినిమాలను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. తెలుసు కదా చిత్రాన్ని 22 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, డ్యూడ్ చిత్రాన్ని పాతిక కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. ప్రదీప్ రంగనాథన్ గత రెండు చిత్రాలు లవ్ టుడే, డ్రాగన్ నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషన్ సృష్టించాయి. అత్యధిక వారాలు ట్రెండ్ అయ్యాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే ఈ రేంజ్ రేట్ కి కొనుగోలు చేశారు. అదే విధంగా సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత విడుదలైన జాక్ చిత్రం థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ, నెట్ ఫ్లిక్స్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో క్లిక్ అయ్యింది. అందుకే ఈ సినిమాని కూడా మంచి రేట్ కి కొనుగోలు చేశారు.
థియేటర్స్ లో ఈ చిత్రాలు ఎలా అయితే ఒకే రోజున విడుదల అయ్యాయో, నెట్ ఫ్లిక్స్ లో కూడా ఒకే రోజున విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాని థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ లో విడుదల చేయాలి. అంటే వచ్చే నెల రెండవ వారం లో ఈ రెండు చిత్రాలను మనం ఓటీటీ లో చూడొచ్చు అన్నమాట. చూడాలి మరి ఓటీటీ ఆడియన్స్ ఏ చిత్రానికి పట్టం కట్టబోతున్నారు అనేది.