Prabhas Project K- Nag Ashwin: బాహుబలి సినిమాల తరువాత ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్నారు. అయితే బాహుబలి తరువాత రెబల్ స్టార్ ఖాతాలో ఒక్కటి సరైన హిట్టు కొట్టింది లేదు. అయినా ఈ హీరోకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కనీసం నాలుగైదేళ్లు ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఓ మూవీ కోసం ప్రభాస్ తో సైన్ చేయించుకున్నాడు. దీనికి ప్రస్తుతానికి ప్రాజెక్ట్ -కే అని టైటిల్ పెట్టారు. అయితే ప్రభాస్ మిగతా సినిమాలను స్పీడ్ చేస్తున్నా.. ప్రాజెక్ట్ -కే మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడం ప్రారంభమయ్యాయి. వెంటనే తేరుకున్న నాగ్ అశ్విన్ దీనిపై షాకింగ్ కారణం చెప్పాడు.

పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకాదరణ ఉన్న ప్రభాస్ మూవీని సాధారణంగా ఊహించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కోసం రూ.100 కోట్లకు తక్కువ కాకుండా బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.500 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ -కే మూవీ మిగతా వాటికంటే డిఫరెంట్ గా ఉంటుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు.ఈ సినిమా కోసం వస్తువులు ఎక్కడా దొరికే అవకాశం లేదు. వాటిని మేమే తయారు చేసుకోవాలి. మహానటి’లో వింటేజ్ కార్లను ఎక్కడినుంచో తీసుకొచ్చాం. కానీ ‘ప్రాజెక్ట్-కే’ కోసం వాడే కార్లు ఎక్కడా దొరకవు. వాటిని మేమే తయారు చేసుకోవాలి.. అని అన్నారు.
ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ అంతా కొత్తవాళ్లే. వీళ్లంతా విజువల్ వండర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఎవెంజర్స్ లాంటి సినిమా టైప్ లో ప్రభాస్ సినిమా ఉండేలా చూసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ప్రాజెక్టు గురించి వివరించడానికి సమయం తీసుకుంటుంది. స్టోరీ పూర్తిగా రెడీ కావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతీ సన్నివేశాన్ని కాంప్రమైజ్ కాకుండా తీయాలని అనుకుంటున్నాం. అందుకు ఎంత బడ్జెట్ అయినా వెనుకాడేది లేదు… అని నాగ్ అశ్విన్ తెలిపారు.

‘ప్రాజెక్ట్-కే’ ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. అందుకు ప్రత్యేక సెట్ ను తయారు చేసే పనిలో ఉన్నాం. నాకు తెలిసి ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న ప్రభాస్ కు ‘ప్రాజెక్ట్-కే’ తో వరల్డ్ లెవల్లో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అందుకే సినిమా సెట్స్ పైకి రావడానికి ఆలస్యమవుతుందని అన్నారు. మరోవైపు ఈ సినిమా కోసం ప్రస్తుతానికి రూ.500 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఇది రాను రాను పెరిగే అవకాశం కూడా ఉందని నాగ్ అశ్విన్ తెలపడం విశేషం.