https://oktelugu.com/

Prashanth Neel : బఘీర తో ప్రశాంత్ నీల్ కి బ్యాడ్ నేమ్ రాబోతుందా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తున్న దర్శకులకు భారీ డిమాండ్ అయితే పెరుగుతుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుల హవా అనేది చాలా వరకు తగ్గింది. సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి ముఖ్యంగా తెలుగు, కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది దర్శకులు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 / 10:57 AM IST

    Prashanth Neel

    Follow us on

    Prashanth Neel: కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియాలో భారీ ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్…ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడంతో మరోసారి ఆయన స్టార్ డైరెక్టర్ గా ఇండియన్ ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ కథ, స్క్రీన్ ప్లే ని అందిస్తున్న బఘీర సినిమా దీపావళి కానుకగా ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకు వెళ్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో కూడా మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక హోంబలే నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని కనుక మనం చూసినట్లైతే కేజిఎఫ్, సలార్ టైప్ లోనే ఈ సినిమా టైలర్ కూడా ఉంది. ఇక ఈ సినిమా మొత్తం యాక్షన్ ఎంటర్టైనర్ తో నింపేశారు.

    ముఖ్యంగా డార్క్ మోడ్ లో సినిమాని చేయడం అనేది కేజీఎఫ్, సలార్ లను తలపిస్తుంది. మరి ప్రశాంత్ నీల్ ఇన్స్ట్రక్షన్స్ తోనే దర్శకుడు ఇలా చేశాడని మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నిజానికి ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న క్రమంలో ఇలా కథ, స్క్రీన్ ప్లే అందించి తను చేయలేని సినిమాలను ఇతరులతో చేయిస్తున్నాడు.

    మరి దీని వల్ల ఆయన కెరియర్ కి ఏదైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందా? అంటే ఉందనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమా కనక తేడా కొడితే ప్రశాంత్ నీల్ ఇమేజ్ చాలావరకు డ్యామేజ్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి దానిమీద ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ నీల్ ఇలా చేయడం ఎందుకని మరికొందరు అంటున్నారు.

    ఇంకొందరు మాత్రం ఈ సినిమాతో భారీగా సక్సెస్ అందుకుంటే మాత్రం ప్రశాంత్ నీల్ పేరు మరోసారి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మారు మ్రోగుతుందని మరి కొందరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే హోం బలే ప్రొడ్యూసర్ చేసే ప్రతి సినిమా వెనకాల ప్రశాంత్ నీల్ హస్తం ఉండబోతుందని రీసెంట్ గా ప్రొడ్యూసర్లు కూడా ప్రకటించడం విశేషం…