Salaar 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabgas) చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. మరి ఆయన సాధించిన విజయాలు ఇప్పుడున్న హీరోలు ఎవరు సాధించకపోవడం విశేషం…పాన్ ఇండియాలో ఇప్పటికే ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒక్కో హీరో పాన్ ఇండియా సినిమా కోసం రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం తీసుకుంటుంటే ఆయన మాత్రం సంవత్సరానికి ఒక సినిమాని రిలీజ్ చేస్తూ పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు… ఎప్పుడైతే బాహుబలి(Bahubali) సినిమా వచ్చిందో అప్పటినుంచి తన హవాని కొనసాగిస్తూ బాలీవుడ్ లో సైతం ఎక్కువ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఫౌజీ (Fouji), స్పిరిట్(Spirit) రాజా సాబ్ (Rajasaab) లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ‘సలార్ ‘సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఎండింగ్ లో దీనికి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ప్రశాంత నీల్ సైతం సినిమా స్టోరీ ని రెడీ చేసుకొని ప్రభాస్ కోసం ఈగర్ గా వెయిట్ చేశాడు. కానీ ప్రభాస్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు కమిట్ అయిపోవడంతో ఈ గ్యాప్ లో ఆయన ఎన్టీఆర్(NTR) తో సినిమాని సెట్ చేసుకున్నాడు.
మరి మొత్తానికైతే ఎన్టీఆర్ సినిమాని పూర్తి చేసిన తర్వాత సలార్ 2(Salar 2) సినిమాని తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించాలనే సంకల్పంతో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే సలార్ 2 సినిమాలో మెయిన్ విలన్ ఎవరో తెలిసిపోయింది. పృధ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా మారతాడు అని అందరూ అనుకున్నారు.
కానీ ‘శౌర్యంగ పర్వం’ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శౌర్యంగుల వైపు ఉన్న బాబీ సింహ ఆ రాజ్యానికి తనే రాజు కావాలనే ఉద్దేశ్యంతో ఆయన ప్రభాస్ ని చంపాలని చూస్తాడట…ఇక మొత్తానికైతే అయితే మెయిన్ విలన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న బాబీ సింహ కూడా భారీ విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. మరి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇక ప్రశాంత్ నీల్ ఈ మూవీ కోసం భారీగా కసరత్తులు చేయడానికి సిద్ధమవుతున్నాడట. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ సలార్ 2 సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలపాలని చూస్తున్నాడు…