Homeఎంటర్టైన్మెంట్Anirudh : స్టార్ హీరో సినిమానా.. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఉండాల్సిందేనా.. ?

Anirudh : స్టార్ హీరో సినిమానా.. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఉండాల్సిందేనా.. ?

Anirudh : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ పేరు మార్మోగిపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు అనిరుధ్, అత్యంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి తన మార్కు చూపించుకున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్. ప్రస్తుతం శ్రోతలందరికీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా తమిళ సినీ ఇండస్ట్రీ లో పని చేసినప్పటికీ ఇటీవల పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. అంతే కాదు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ హీరోలను దాటేసి రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందించిన అన్నిసినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. అందుకే చాలా మంది స్టార్ డైరెక్టర్స్ సైతం అనిరుధ్ కోసం క్యూ కడుతున్నారు. ఎన్ని కోట్లు అయినా కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటున్నారు. మొత్తానికి అన్ని భాషల్లో తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

అనిరుధ్ ఫేమ్ జైలర్ సినిమాతో మరింతగా పెరిగింది. అంతే కాదు తెలుగులో కూడా వరుసగా హిట్లు ఇస్తున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర సినిమాకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజక్ అందరిని మెస్మరైజ్ చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. మరీ ముఖ్యంగా దేవర టైటిల్ సాంగ్ కు సినిమా హాళ్లలో జనాలంతా గొంతుకలిపారంటే ఆ పాటలు ఎంతలా ప్రభావం చూపాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరో సినిమా అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఉండాల్సిందే అన్నట్లు తయారైంది పరిస్థితి. భారీ బడ్జెట్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తూ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా అనిరుధ్ మారిపోయారు. మన టాలీవుడ్‌లోనూ అదరగొట్టే మ్యూజిక్ డైరెక్టర్లున్నప్పటికీ ఈయన వైపే దర్శకులు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్- నెల్సన్, అల్లు అర్జున్- అట్లీ, ప్రభాస్ – లోకేశ్ కనగరాజ్ సినిమాలకు అనిరుధ్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

అటు తమిళంలో ప్రస్తుతం జైలర్ 2, ఇండియాన్ 3, విజయ్ దళపతి చివరి సినిమాకు కూడా అనిరుధ్ మ్యూజిక్ అందజేస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో నాని హీరోగా నటిస్తున్న ప్యారడైస్ తో పాటు విజయ్ దేవరకొండ VD12, సినిమాలకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ మూవీ లైనప్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు దాదాపుగా డజన్ కు పైగా సినిమాలు చేస్తున్నాడు. ఇక అందులో ఎక్కువ సినిమాలు తెలుగుకు చెందినవే అవ్వడం గమనార్హం.

ఇలా ఇన్ని సినిమాలు పెట్టుకుని తెలుగు మేకర్స్ ను టెన్షన్ పెడుతున్నాడట అనిరుధ్. అయితే అనిల్ రావిపూడి లాంటి వారు మాత్రం బీమ్స్ లాంటి వారిని ఎంకరేజ్ చేస్తూ.. హిట్లు కొడుతున్నారు. ఇలా తెలుగులో ఉన్న మంచి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంకరేజ్ చేయాలని కొందరు సూచిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular