Prabhas asking fans stay away: బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్(Rebel Star PRabhas) చేసిన ప్రతీ చిత్రం భారీ గానే ఉంటూ వచ్చింది. ఫలితంగా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వసూళ్లు కూడా భారీగానే ఉండేవి. ఆయన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాకు వచ్చే వసూళ్లు, మన స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలకు వచ్చే వసూళ్లతో సమానంగా ఉండేవి. అయితే ప్రభాస్ మొట్టమొదటిసారిగా తన రేంజ్ కి తగ్గ సినిమా కాకుండా, హారర్ కామెడీ ని టచ్ చేస్తూ ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం చేసాడు. బాహుబలి, కర్ణ, సలార్ లాంటి పాత్రలు చేసిన ప్రభాస్ తో కామెడీ సినిమా చేయిస్తే ఎవరు చూస్తారు చెప్పండి?, హైప్, క్రేజ్ ఏర్పడడం కష్టం అని ఈ సినిమా మొదలైనప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. అనుకున్నట్టు గానే ఈ చిత్రానికి ఎలాంటి హైప్ ఏర్పడలేదు. ఫలితం గా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ అత్యంత దయనీయంగా ఉంది. ఒక పక్క సందీప్ వంగ ప్రభాస్ ని ఇండియా’స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని తన ‘స్పిరిట్’ చిత్రం ద్వారా చూపిస్తున్నాడు.
అలాంటి పెద్ద ట్యాగ్ పెట్టిన తర్వాత ‘రాజా సాబ్’ కి ఓవర్సీస్ నుండి వస్తున్న అడ్వాన్స్ గ్రాస్ వసూళ్లను చూసి ఇతర హీరోల అభిమానులు నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. 15 రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి లక్షా 40 వేల డాలర్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇకపోతే రీసెంట్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ‘రాజాసాబ్’ చిత్రానికి భారీ ప్రొమోషన్స్ చేయవద్దని ప్రభాస్ తన మూవీ టీం కి చెప్పినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా అభిమానులు కూడా స్వతంత్రం గా ప్రొమోషన్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని ప్రభాస్ అన్నట్టు సమాచారం. మొట్టమొదటి సారి తన ఇమేజ్ ని పూర్తిగా పక్కన పెట్టి చేస్తున్న హారర్ కామెడీ చిత్రమిది. ప్రొమోషన్స్ చేసి లేని పోనీ హైప్ క్రియేట్ చేసి, ఒకవేళ ఆ హైప్ కి తగ్గట్టుగా సినిమా లేకపోతే మొదటికే మోసం వస్తుంది.
అందుకే ఈసారి సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాకనే ప్రొమోషన్స్ చేస్తే బాగుటుందని ప్రభాస్ అభిప్రాయం పడుతున్నాడట. మనది మంచి లాంగ్ రన్ వచ్చే మూవీ కాబట్టి, ఓపెనింగ్స్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవిధంగా ఈ స్ట్రాటజీ కూడా మంచిదే. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్లి, ఒకవేళ సినిమా అలరిస్తే వచ్చే సర్ప్రైజ్ ఫీలింగ్ కి వెలకట్టలేము. ఇకపోతే ఈ చిత్రాన్ని జనవరి 9 న విడుదల చేస్తున్నారు. ఒక రోజు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 నుండి ప్రీమియర్ షోస్ మొదలు అవుతాయట.