Peddi director Buchi Babu: డైరెక్టర్ సుకుమార్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన బుచ్చి బాబు(Buchi Babu Sana), ‘ఉప్పెన’ చిత్రం తో డైరెక్టర్ గా అరంగేట్రం చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో, బుచ్చి బాబు ని చూసి అందరూ టాలీవుడ్ కి కొత్త టాలెంట్ వచ్చింది, రాబోయే కాలం లో మరో స్టార్ డైరెక్టర్ గా బుచ్చి బాబు నిలుస్తాడు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేశారు. వాళ్ళ ఊహకు తగ్గట్టుగానే రెండవ సినిమాకు ఆయన ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ని పట్టేసాడు. రామ్ చరణ్ తో సినిమా అంటే ఆషామాషీ విషయం కాదు కదా?, పాన్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి నచ్చేలా కథ చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా పెద్ది మూవీ బుచ్చి బాబు దర్శకత్వం లో మొదలైంది
ఈ సినిమా పై ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో మొదటి నుండి విపరీతమైన హైప్ తో ఉండేది. ఆ హైప్ కి తగ్గట్టే మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత రీసెంట్ గా విడుదలైన ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించి ‘పెద్ది'(Peddi Movie) పై అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యేలా చేసింది. అలాంటి సమయం లో ఆ చిత్ర డైరెక్టర్ బుచ్చి బాబు ఎక్కడో ఈ సినిమా స్టోరీ ని ఇండస్ట్రీ లో తనకు బాగా దగ్గరైన వాళ్లకు వినిపించాడు. ఈ కథని విన్న వాళ్ళు కొంతమంది రివ్యూయర్స్ బ్యాచ్ కి లీక్ చేశారు. రీసెంట్ గానే యూట్యూబ్ లో రివ్యూయర్స్ గా బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న కొంతమంది రివ్యూయర్స్ పెద్ది గురించి చర్చ పెట్టారు.
యూట్యూబ్ లో పూలచొక్కా అనే పాపులర్ రివ్యూయర్ ఉంటాడు, మీ అందరికీ అతను తెలిసే ఉంటుంది. ఆయన ‘నాకు పెద్ది మూవీ స్టోరీ తెలుసు..కానీ నేను కథ బయటకు చెప్పను, కేసు వేస్తారు నా మీద’ అని అంటాడు. అప్పుడు ‘బార్ బెల్ పిచ్ మీటింగ్స్’ ఛానల్ ఓనర్ మాట్లాడుతూ ‘స్టోరీ చెప్పనవసరం లేదు. కేవలం ఆ స్టోరీ ఎలా ఉందో చెప్పు’ అని అంటాడు. అప్పుడు పూలచొక్కా ‘ఇలాంటి స్టోరీ తో అలాంటి సినిమా తీస్తున్నావా..పైగా చికిరి చికిరి లాంటి పాటలు పెట్టి’ అంటూ వెక్కిరిస్తాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. పూల చొక్కా పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరో పక్క బుచ్చి బాబు కి కూడా నిర్మాతలు చాలా గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా స్టోరీ ని దారిన పొయ్యే ప్రతీ ఒక్కరికి చెప్పుకుంటూ వచ్చావా?, మన సినిమా స్టోరీ వాళ్లకు ఎలా తెలిసింది? అని బుచ్చి బాబు తిట్టారట నిర్మాతలు.