Epstein files missing: ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ స్టీన్ ఫైల్స్ ఎంతటి సంచలనం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారంలో వేలాది ఫోటోలు ఉన్నాయని.. ప్రపంచప్తంగా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వ్యక్తులంతా ఇందులో ఉన్నారని అమెరికా మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నుంచి మొదలు పెడితే.. ట్రంప్ వరకు అందరూ ఉండడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.
ఇటీవల అమెరికా మీడియాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఫోటోలు దర్శనమిచ్చాయి. అతడితో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు. కొన్ని ఫోటోలు అత్యంత దారుణంగా ఉన్నాయని.. అవి బయట పెడితే ఆ ప్రముఖుల అసలు గుట్టు బయటపడుతుందని చాలామంది అనుకున్నారు. అయితే ఇందులో కొంతమేర మతలబు చోటుచేసుకుంది. అంతేకాదు ట్రంప్ ఫోటోలు కూడా మాయమయ్యాయి. దీంతో తెరవెనక ఏదో జరిగి ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే ఊహించని విధంగా సోమవారం తెల్లవారుజామున కొన్ని ఫోటోలు బయటకు రావడంతో మరోసారి కలకలం ఏర్పడింది.
ఎప్ స్టీన్ వ్యవహారానికి సంబంధించిన దాదాపు 16 ఫైల్స్ మాయమైనట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు కొద్దిరోజులుగా వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే వీటిలో న్యాయశాఖ సంబంధించిన వెబ్ పేజీ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోటో మళ్లీ ప్రత్యక్షమైంది. కొద్ది రోజులు ఈ ఫోటో మిస్ అయినట్టు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఫోటోకు సంబంధించి తాత్కాలికంగా రివ్యూ కోసమే తొలగించామని అమెరికా న్యాయశాఖ అధికారులు చెప్పడం గమనార్హం. అయితే ఆ ఫోటోలో ట్రంప్ తన భార్య మెల్లనియ, ఎప్ స్టీన్, అతడి స్నేహితురాలు గిస్లైన్ మాక్స్ వెల్ కనిపించారు.
ట్రంప్ ఫోటో మాయం వెనక అమెరికాను ఆశాక అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంలో ఉన్న యువతులకు సంబంధించిన గుర్తింపులు, ఇతర వ్యవహారాలు బయటికి రాకుండా ఉండడానికి చర్యలు తీసుకున్నామని.. దాని సమీక్ష కోసం ట్రంప్ ఫోటో బయటికి రాకుండా తొలగించామని అమెరికా న్యాయశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇదంతా తాత్కాలికంగానే చేశామని.. ఈ కేసులో ఎవరైతే బాధితులుగా ఉన్నారో.. వారిని మాత్రమే తాము రక్షించడానికి దస్త్రాలలో సవరణలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎవరి వైపు తాము పక్షపాతం ప్రదర్శించడం లేదని.. సమరూపకంతోనే వ్యవహరిస్తున్నామని వెల్లడించారు.