https://oktelugu.com/

Gabbar Singh Re Release : గబ్బర్ సింగ్ రీ రిలీజ్ లో ఎన్ని కోట్లు వసూలు చేయబోతుందంటే..?

ప్రస్తుతం స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలను చేసుకుంటూ బిజీగా కొనసాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ల అభిమానులు మాత్రం గతంలో సూపర్ హిట్ అయిన మన స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఆ హీరోల బర్త్ డే లను సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 / 08:23 PM IST

    Gabbar Singh Re Release

    Follow us on

    Gabbar Singh Re Release : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. పెద్ద హీరో నుంచి చిన్న సినిమా హీరో వరకు ప్రతి ఒక్కరు తమ బర్త్ డే ని పురస్కరించుకొని సినిమాలను చేస్తూ తమ అభిమానుల్లో ఆనందాన్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమా థియేటర్ లోకి రావడానికి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పదుతుంది. దానివల్ల అభిమానులు వాళ్ళ అభిమాన హీరోని స్క్రీన్ మీద చూసుకోవడానికి ఎక్కువ సమయం అయితే వేచి చూడాల్సిన సమయం పదుతుంది. కాబట్టి రీ రిలీజ్ ల పేరుతో హీరోల సూపర్ హిట్ సినిమాలను వాళ్ళ బర్త్ డే ల సందర్భంగా రిలీజ్ చేస్తూ పెద్ద తెరమీద మరోసారి వాళ్ళ హీరోలను చూసుకొని ఆనంద పడిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ బర్త్ డే ని పురస్కరించుకొని సెప్టెంబర్ రెండొవ తేదీన గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఇక అందులో భాగంగానే ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో ఉండడమే కాకుండా కలెక్షన్లు కూడా చాలా భారీ రేంజ్ లో రాబోతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే రీసెంట్ గా మురారి సినిమా రిలీజై దాదాపు పది కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి భారీ రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఆ రికార్డును బ్రేక్ చేయడానికి గబ్బర్ సింగ్ సినిమా థియేటర్లోకి వస్తుంది.

    ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే గబ్బర్ సింగ్ సినిమాకి దాదాపు 15 నుంచి 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయితే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అందుకోసమే పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూడడానికి వాళ్ళు ఒక్కసారి కాదు పదిసార్లు అయిన ఆ సినిమాని చూడడానికి సిద్ధంగా ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అందులో భాగం గానే ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా భారీ సక్సెస్ ని సాధించడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక అందరూ అనుకున్నట్టుగానే గబ్బర్ సింగ్ సినిమా మురారి రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా 2012 వ సంవత్సరంలో వచ్చి పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు పది సంవత్సరాల నుంచి దక్కని సక్సెస్ ని ఈ సినిమా అందించడమే కాకుండా ఆయన స్టార్ డమ్ ను మరింత పెంచిందనే చెప్పాలి…