Pawan Kalyan: హీరోలందు పవన్ వేరయా అని చెప్పుకోవాలి. ప్రేక్షకుల్లో పవన్ కి ఆ స్థాయిలో అభిమానం ఉంది. ఏ హీరోకైనా అభిమానులు థియేటర్ వరకే పరిమితం అవుతారు. కానీ, పవన్ పై అభిమానానికి పరిమితులు లేవు. ఏ హీరోకి లేని క్రేజ్ ఒక్క పవన్ కి మాత్రమే సాధ్యం అయ్యింది. ఏ హీరోకి లేని భక్తులు ఒక్క పవన్ కి మాత్రమే ఉన్నారు. అసలు పవర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్.

స్టార్ డమ్ లోనే కాదు, సేవలోనూ పవన్ డిఫరెంటే. ఎన్నో సందర్భాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసే పవన్.. మరోసారి తన పెద్ద మనసు ఘనంగా చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామానికి చెందిన తవిటి వెంకటేష్, పవన్ కి వీరాభిమాని.

Also Read: Pawan Kalyan Bheemla Nayak Movie: పవన్ కళ్యాణ్ ముందు చూపు.. ‘భీమ్లానాయక్’ లాభాలతో ఏం చేశాడో తెలుసా?
అయితే, దురదృష్టవశాత్తు అతను ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ చలించిపోయాడు. అతని ఫ్యామిలీ కష్టకాలంలో ఉంది అని తెలిసి వెంటనే ఆర్థిక సాయం చేశాడు. ‘అడగనది అమ్మ అయినా అన్నం పెట్టదు’ అంటారు, కానీ అడగకముందే వారి ఆకలి బాధను గ్రహించి 5 లక్షల రూపాయలు ఇచ్చారు పవన్. తన అభిమాన కుటుంబం కన్నీళ్లు తుడిచిన పవన్ కి జనసైనికులు అభినందులు తేలుపుతున్నారు.
అన్నట్టు పవన్ జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వంతో పాటు బీమా సౌకర్యం కూడా కల్పించారు. ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబాలకు బీమా సొమ్ము లభిస్తుంది. అయితే తవిటి వెంకటేష్ పార్టీ తరఫున బీమా చేయించుకోలేదు. అయినా, పవన్ కళ్యాణ్ ఔదార్యం ప్రదర్శించి.. వెంకటేష్ కుటుంబానికి అండగా నిలబడ్డాడు.
ఆ మధ్య విద్యుదాఘాతానికి గురై మరణించిన తన ముగ్గురు అభిమానుల కుటుంబాలకు కూడా పవన్ ఇలాగే ఆర్థిక సాయం చేశారు. అందుకే..హీరోలందు పవన్ వేరయా.
Also Read: Pawan Kalyan Tweet Viral: పవన్ కళ్యాణ్ యుద్ధం ఎప్పుడు చేస్తాడో తెలుసా?
[…] Also Read: హీరోలందు పవన్ కళ్యాణ్ వేరయా ! […]
[…] Also Read: హీరోలందు పవన్ కళ్యాణ్ వేరయా ! […]
[…] Nadendla Manohar: పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించిన జనసేన పార్టీకి.. ఈ మార్చి 14తో ఎనిమిదేండ్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆవిర్భావ సభకు కూడా ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందంటూ ఆరోపిస్తున్నారు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్. వారంలో ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు సభా స్థలం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. […]