https://oktelugu.com/

Hero Surya:పేదలకు ఉచితంగా ఇల్లులు కట్టించిన హీరో సూర్య

Hero Surya: మనం ఎంతగానో అభిమానించే హీరోలలో కొంతమంది సేవ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వాళ్ళు ఎందరో ఉన్నారు..వారిలో మన తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఒక్కరు..విభిన్నమైన సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ హీరో తానూ స్థాపించిన అగార ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల మంది విద్యార్థులను తన సొంత ఖర్చులతో ఉచితంగా చదివిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 20, 2022 / 05:23 PM IST
    Follow us on

    Hero Surya: మనం ఎంతగానో అభిమానించే హీరోలలో కొంతమంది సేవ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వాళ్ళు ఎందరో ఉన్నారు..వారిలో మన తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఒక్కరు..విభిన్నమైన సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ హీరో తానూ స్థాపించిన అగార ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల మంది విద్యార్థులను తన సొంత ఖర్చులతో ఉచితంగా చదివిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవ కార్యక్రమాలు అన్ని ఇన్ని కావు..తమిళనాడు లో ఎంతో మందికి గుండె ఆపరేషన్లు కూడా ఆయన ఈ ఫౌండేషన్ ద్వారా చేసారు..అంతతి ఉదార స్వభావం గల సూర్య మరోసారి తన ఉదారత్వం ని చాటుకున్నాడు..ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ బాల తో ఒక్క సినిమా చేస్తున్నాడు..ఈయనతో గతం లో సూర్య విక్రమ్ కలిసి శివ పుత్రుడు అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ద్వారానే సూర్య మన తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అయ్యాడు.

    Hero Surya

    మళ్ళీ ఇన్ని సంవత్సరాల భారీ గాప్ తర్వాత ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఇందులో సూర్య ఒక్క జాలరి పాత్రలో నటిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై లోని ఒక్క ప్రాంతం లో గుడిసెలతో కూడిన ఒక్క భారీ సెట్ ని వేయిస్తున్నారు నిర్మాతలు..మత్సకారుల కష్టసుఖాలు దగ్గర ఉందిమరి చూసి చలించిపోయిన సూర్య ఇక్కడ షూటింగ్ పూర్తి అయ్యిపోయిన తర్వాత ఆ గుడిసెలు అన్ని ఆశర్యం లేక కష్టాలుపడుతున్న మత్స్యకారులకు ఇచ్చేయాల్సిందిగా నిర్మాతకి చెప్పాడట సూర్య..ఆ సెట్స్ ని నిర్మించడానికి అయిన ఖర్చుని నా పారితోషికం లో కట్ చేసుకోమని చెప్పాడట..ఉదార హృదయం తో సూర్య చేసిన ఈ పనికి మత్సకార వ్యవస్థ మొత్తం సెల్యూట్ చేస్తుంది..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ సెట్స్ ని నిర్మించడానికి దాదాపుగా 3 కోట్ల రూపాయివుల ఖర్చు అయ్యింది అట..ఇంత భారీ మొత్తం డబ్బుని ఒక్క మంచి కార్యక్రమం కోసం తుణప్రాయం లో వదులుకున్న సూర్య మంచి మనుసు ని చూసి కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

    Also Read: Telangana BJP: ప‌ద‌వి లేక‌పోతే ఫైర్ త‌గ్గుతుందా.. బీజేపీలో ఆ ముగ్గురికి ఏమైంది..?

    సూర్య మరియు బాల కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా లో సూర్య సరసన హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తుంది..ఆకాశమే నీ హద్దురా మరియు జై భీం వంటి వరుస OTT సినిమాల తర్వాత సూర్య హీరో గా నటించిన ET అనే సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిలిచింది..కాపన్ అనే సినిమా తర్వాత సూర్య హీరో గా నటించిన సినిమా థియేటర్స్ లో విడుదల అవ్వడం ET తోనే జరిగింది..ఇంతకాలం అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం తో వాళ్ళు తీవ్రమైన నిరాశకి గురి అయ్యారు..రాబొయ్యే సినిమాలలో ఎదో ఒక్కటి కచ్చితంగా విజయం సాధించాలి అని వాళ్ళు సోషల్ మీడియా సాక్షిగా ఆ దేవుడుకిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు..ప్రస్తుతం సూర్య బాల తో చేస్తున్న సినిమా కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్(అసురన్ ఫేమ్ ) తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా మీదనే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    Also Read: Power Star Pavan Kalyan: ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యబోతున్న పవర్ స్టార్.. షాక్ లో ఫాన్స్

    Recommended Videos:

    Tags