Homeఎంటర్టైన్మెంట్Nani vs Ram Charan: రామ్ చరణ్ తో పోటీ పెట్టుకునే స్థాయిలో నాని లేడా..?

Nani vs Ram Charan: రామ్ చరణ్ తో పోటీ పెట్టుకునే స్థాయిలో నాని లేడా..?

Nani vs Ram Charan: సినిమా ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ వస్తే చాలదు బ్యాక్ టు బ్యాక్ వరుస సక్సెస్ లను సాధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగొందుతారు. దాని కోసం మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడం సినిమా మీద ఎక్కువ ఫోకస్ తో వర్క్ చేస్తుండటం వల్ల అది సాధ్యమవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా మారిన నాని ఆ తర్వాత చేసిన సినిమాలతో ఫ్లాపులను మూట గట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన న్యాచురల్ స్టార్ గా అవతరించడమే కాకుండా మాస్ ప్రేక్షకులకు పూర్తిగా దగ్గరైపోయాడు. దసర సినిమాతో మాస్ హీరో గా అవతరించాడు. ఇప్పుడు చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా తనలో ఉన్న పూర్తి నటుడిని బయటికి తీసి ప్రేక్షకులందరిని ఆనందింపజేస్తున్నాడు. ఇక రామ్ చరణ్, నాని మధ్య పోటీ లేకపోయిన కూడా వాళ్ళు చేస్తున్న సినిమాల మధ్య పోటీ ఉంది.

రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ సినిమాలు మార్చి 26వ తేదీన రిలీజ్ అవుతాయంటూ అనౌన్స్ చేశారు. దాంతో ఈ రెండు సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడిందని అందరు భావించారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే రెండు సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ప్యారడైజ్ మాత్రం ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది.

ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయిన కూడా రెండు సినిమాల మధ్య పోటీ అయితే ఉండనుంది. రెండు సినిమాల కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి. రామ్ చరణ్ 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడతాడా? నాని ఈసారి ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తాడు అనేది ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular