Shivaji Viral Video: ‘దండోరా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ(Actor Sivaji) హీరోయిన్స్ వేసుకునే దుస్తులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకి వచ్చి శివాజీ మాట్లాడింది తప్పు అంటూ మాట్లాడడం అందరినీ షాక్ కి గురి చేసింది. గతం లో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఎన్నో దారుణమైన వ్యాఖ్యలు చేశారు, ఆ సమయం లో ఒక్కరు కూడా స్పందించలేదు, ఇక్కడ శివాజీ చక్కగా చీర కట్టుకొని రండి అమ్మా అని ఒక పెద్ద మనిషి తరహాలో ఇచ్చిన సలహాకు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు?, ఈమధ్య కాలం లో శివాజీ ఎదుగుదల ని తట్టుకోలేకనా ఇలా చేస్తున్నారా?, కచ్చితంగా ఇది టార్గెటింగ్ లాగానే అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ వ్యవహారం వెనుక కొణిదెల నాగబాబు(Konidela Nagababu) హస్తం ఉందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గానే ఆయన శివాజీ వ్యాఖ్యలను తప్పు బాదుతూ ఏకంగా 14 నిమిషాల నిడివి ఉన్న వీడియోని చేసాడు. సమాజం లో ఈమధ్య కాలం లో ఎన్నో సంఘటనలు జరిగాయి, వాటి గురించి పెదవి విప్పని నాగబాబు, ఎందుకు శివాజీ విషయం లోనే పనిగట్టుకొని మరీ వీడియో చేసాడు? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శివాజీ కూడా మహిళా కమీషన్ తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత, మీడియా తో మాట్లాడుతూ ‘నాకు బాగా కావాల్సిన వాళ్ళు, నన్ను ఎల్లప్పుడూ మెచ్చుకునే వాళ్ళు, కొంతమంది జూమ్ మీటింగ్స్ పెట్టుకొని మరీ మూకుమ్మడిగా దాడి చేశారు. ఇది తెలుసుకొని నేను చాలా బాధ పడ్డాను. ఎందుకు నా మీద ఇంత పగ, నాపై ఇంత కక్ష్య గట్టాల్సిన అవసరం ఏంటి?’ అంటూ బాధతో మాట్లాడాడు, ఆ వీడియో ని మీరు క్రింద చూడొచ్చు.
సినీ ఇండస్ట్రీ లో శివాజీ బాగా అభిమానించేది మెగా ఫ్యామిలీ నే. ఈ విషయాన్నీ బహిరంగంగా ఆయన ఎన్నో సార్లు చెప్పాడు కూడా. దీంతో ఇప్పుడు శివాజీ ‘నాకు బాగా కావాల్సిన వాళ్ళు ‘ అని స్పెషల్ గా ఉద్దేశించి చెప్పాడంటే, కచ్చితంగా నాగబాబు గురించే అయ్యుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఈ అంశం పై సంపాందించకుండా, మౌనం గా ఉండుంటే అసలు ఈ అనుమానాలు వచ్చేవి కాదు, కానీ ఆయన అంత ఆవేశం తో మాట్లాడడం ని చూస్తుంటే, ఆయనకు శివాజీ మాట్లాడిన మాటలు నచ్చక తన క్లోజ్ సర్కిల్ తో ఇలా మాట్లాడించి ఉంటాడని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ఎంత మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో అయినా తెలుస్తుందో లేదో చూడాలి.
చాలా మంది జూమ్ మీటింగ్లు పెట్టుకుని మరి నా మీద కుట్ర చేసారు
నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా నా మీద కుట్ర చేశారు – నటుడు శివాజీ pic.twitter.com/Eibter27m9
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2025