Naga Chaitanya: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో నాగచైతన్య ఒకరు… ఆయన సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నప్పటికి సక్సెసులు మాత్రం పెద్దగా రావడం లేదు. ఒకవేళ సక్సెస్ లు వచ్చిన కూడా ఆ సంతోషం కొంతకాలమే ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మళ్లీ ఫ్లాప్ బాట పడుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట చేసే సినిమాలన్నీ కూడా సక్సెస్ ఫుల్ సినిమాలే కావాలనే ఉద్దేశ్యంతో నాగచైతన్య ఏరీ కోరీ మరి కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. దీనివల్ల ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతోంది…
అలాగే ప్రేక్షకుల నుంచి ఏం కోరుకుంటున్నారో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది… కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాతో నాగచైతన్య భారీ సక్సెస్ ని కొట్టి మరోసారి భారీ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
కార్తీక్ వర్మ ఇంతకుముందే సాయిధరమ్ తేజ్ తో చేసిన ‘వీరూపాక్ష’ సినిమాతో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా సాధించిన సక్సెస్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి… సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే అది బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ అనే చెప్పాలి…అందుకే నాగచైతన్య తో చేస్తున్న సినిమా మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఇక ఈ సినిమాకి సుకుమార్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో ఈ సినిమాలో సుకుమార్ హస్తం కూడా ఉంది.
కాబట్టి సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తోంది అంటూ ప్రతి ఒక్కరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగ చైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా ఈ సినిమా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక నాగ చైతన్య దురదృష్టం ఏంటో కానీ ఇతర హీరోలకు సక్సెస్ లను ఇచ్చిన ప్రతి దర్శకుడు ఆయన దగ్గరికి వచ్చేసరికి డీలా పడిపోతున్నాడు. కార్తీక్ దండు ఆ రూల్ ని బ్రేక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…