Salaar Part 2: ప్రభాస్.. ఈ పేరు వింటేనే ఫుల్ విజిల్స్ వినిపిస్తుంటాయి. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఏకంగా దేశం నలుమూలలా ఈయన పేరు మారుమోగింది. బాహుబలి సినిమాతో తన సత్తాను చాటిన ఈ స్టార్ హీరో.. సలార్ సినిమాతో ఆ స్థానాన్ని మరింత పెంచుకున్నారు. రాజమౌళితో తెరకెక్కించిన బాహుబలి సినిమా సిరీస్ మాదిరి ఇప్పుడు సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. మరి రెండో పార్ట్ ఎలా ఉంటుందో తెలుసా?
రీసెంట్ గా ఫ్లాప్ లతో బాధ పడిన ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు వర్షం, డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, వంటి సినిమాలతో సూపర్ హిట్ ను అందుకున్న ఈ స్టార్ రీసెంట్ గా ఫ్లాప్ లను అందుకోవడంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు. ఇక వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యంతో మరింత బాధ పడ్డారు ఫ్యాన్స్ కానీ సలార్ హిట్ తో ఇక ప్రభాస్ కు తిరుగులేదని ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సలార్ హిట్ వల్ల దీనికి సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. తల్లి క్యారెక్టర్ ను ఈశ్వరీ రావ్ చేసిన సంగతి తెలిసిందే. ఈమె క్యారెక్టర్ అద్భుతమనే చెప్పాలి. ఇక ఇందులో మరో మెయిన్ క్యారెక్టర్ విలన్. ఈ పాత్రలో పృథ్వి రాజ్ సుకుమారన్ మెప్పించారు. అయితే పార్ట్ 2లో వీరు బద్ధ శత్రువులగా మారబోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకోసమే ఈ పార్ట్ 2ని శౌర్యంగ పర్వం అనే టైటిల్ తో ఫిక్స్ చేశారట.
అయితే ప్రభాస్, పృథ్వి రాజ్ సుకుమారన్ ఇద్దరు కూడా గొడవ పెట్టుకోవడంతో తల్లి వచ్చి సినిమా మొత్తాన్ని టర్న్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పృథ్వి రాజ్ సుకుమారన్ కి ప్రభాస్ వాళ్ల అమ్మంటే చాలా ఇష్టం. అందుకే ఏం చెప్పిన వింటాడు. ఇటు ప్రభాస్ ని అటు పృథ్వి రాజ్ సుకుమారన్ ని హ్యాండిల్ చేసే ఒకే ఒక్కరు ఆమె కాబట్టి ప్రభాస్ తల్లినే ఈ సినిమా కథని మొత్తం మార్చబోతుందట.