Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో లభించిన విజయంతో ఆయనలో ఉత్సాహం పెరిగింది. గెలుపు రుచి చూడటంతో తన పలుకుబడితో విజయం ముంగిట నిలిచి ఆయనలో రెట్టించిన జోష్ లో కనిపిస్తున్నారు. దీంతో మంచు కుటుంబం ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పవచ్చు. అసలు గెలుస్తామని భావించకపోయినా పోటీలో ఉండేది లేనిది కూడా స్పష్టంగా లేకపోయినా అనుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం తెలిసిందే.

గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. తనకు ఆసక్తి ఉందో లేదో కానీ ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. ప్రస్తుతం లభించిన గెలుపుతో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా పోటీ చేయలేదు. ప్రచారం మాత్రం చేశారు.
మంచు లక్ష్మి కూడా గతంలో ఓ పార్టీ ద్వారా పోటీ చేయడానికి ముందుకు వచ్చినా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇటీవల మాట్లాడుతూ రాజకీయాలంటే 99 శాతం ఇష్టం లేదని చెబుతున్నా ఒక్క శాతం మాత్రం ఆప్షన్ ఇచ్చుకున్నారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఏ పార్టీలో చేరతారనే విషయం మాత్రం స్పష్టం కావడం లేదు.
దీంతో ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునందుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నట్లు సమాచారం. భవిష్యత్ లో ఆయన రాజకీయాల్లో ప్రభావం చూపాలని చూస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి ప్రత్యక్ష రాజకీయాలకు మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.