Mahesh Babu Varanasi salary: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉంటున్నాడు. ఒకే ఒక్క చిన్న గ్లింప్స్ వీడియో తో ఈ చిత్రం పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో విపరీతమైన హైప్ ఏర్పడింది. అంతే కాకుండా ‘సంచారి’ పాట కూడా బాగా వైరల్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తోంది. ఎలాంటి డ్యాన్స్ స్టెప్పు లేకపోయినా కూడా ఈ రేంజ్ ఇంత తక్కువ సమయం లో రావడాన్ని చూస్తుంటేనే అర్థం అవుతోంది, ఈ సినిమా పై ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంది అనేది. ఈ పాట తో ఈ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ కి సంబంధించిన థీమ్ సాంగ్ ‘రణ కుంభ’ పాటకు కూడా ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఒక చర్చ నడుస్తూనే ఉంది. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ని నెల జీతం లాగా తీసుకుంటున్నాడట. అంటే ఏడాదికి 75 కోట్ల రూపాయిలు ఛార్జ్ చేస్తున్నాడని సమాచారం. ఏడాదికి 75 కోట్లు అంటే నెలకు 6 కోట్ల 25 లక్షల రూపాయిలు అన్నమాట. రెండేళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ కచ్చితంగా ఉంటుంది కాబట్టి, ఓవరాల్ గా మహేష్ బాబు రెమ్యూనరేషన్ దాదాపుగా 150 కోట్ల రూపాయిలు అట. ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా ఇప్పటి వరకు మహేష్ బాబు చెయ్యలేదు. అయినప్పటికీ కూడా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడంటే మామూలు విషయం కాదు.
ఇక రాజమౌళి విషయానికి వస్తే, ఈ సినిమాకు ఆయన ఒక అనధికారిక నిర్మాత అనుకోవచ్చు. KL నారాయణ ఈ చిత్రానికి నిర్మాత, కానీ రాజమౌళి కి కూడా లాభాల్లో వాటాలు ఉంటాయట. అంటే ఒకవేళ ఈ చిత్రం 3000 కోట్ల రూపాయిల వసూళ్లను రాబడితే, రాజమౌళి అందులో 30 శాతం వాటా, అంటే 900 కోట్లు అందుకుంటాడు అన్నమాట. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం ఈ సినిమాకు పని చేస్తున్నారు కాబట్టి, తనకు వచ్చిన ఆ డబ్బుల్లో అందరికీ వాటాలు పంచుతాడట రాజమౌళి. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని కలలో కూడా ఏ డైరెక్టర్ అందుకోలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు.