https://oktelugu.com/

Karthik Subbaraj: సూర్య 44 విషయంలో కార్తీక్ సుబ్బరాజ్ తప్పు చేస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. మరి వాళ్ళు అనుకున్న గుర్తింపు రావడానికి ఎలాంటి ఇబ్బంది నైనా సరే ఎదుర్కొని సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు...ఇలాంటి హీరోలే స్టార్లు గా మారుతుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 18, 2024 / 01:29 PM IST

    Karthik Subbaraj

    Follow us on

    Karthik Subbaraj: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు సూర్య… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన చేస్తున్న సినిమాలన్నీ ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక దీపావళి కానుకగా ఈయన ‘కంగువా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక దర్శకుడు శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని ఆయన భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ‘సూర్య 44’ అనే (వర్కింగ్ టైటిల్) తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి మొదట ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ అద్భుతంగా ఉండడంతో సినిమా మీద హైప్ అనేది భారీ స్థాయిలో పెరిగిపోయింది.

    నిజానికి కార్తీక్ సుబ్బరాజ్ లాంటి దర్శకుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా వాళ్ళ అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన ‘జిగర్తాండ ‘ లాంటి సినిమాకి నేషనల్ లెవల్లో గుర్తింపు రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ సూర్యతో చేస్తున్న సినిమా విషయంలో కొంతవరకు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    నిజానికి ఈ సినిమా గ్యాంగ్ స్టర్ సినిమా కాదట. కానీ పోస్టర్ ను మాత్రం గ్యాంగ్ స్టార్ రేంజ్ లో డిజైన్ చేసి రిలీజ్ చేశారు. దానివల్ల ప్రేక్షకుడిలో ఈ సినిమా మీద ఒక ముద్ర అయితే ఉండిపోయింది. అది ఏంటి అంటే సూర్య తన తర్వాత సినిమాని ఒక భారీ గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా ఒక లవ్ స్టోరీ తో పాటు డిఫరెంట్ జానర్ లో తెరకెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పోస్టర్ మీద కూడా క్లారిటీ ఇస్తు ఇది గ్యాంగ్ స్టర్ కి కాదని రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజ్ స్పష్టం చేశాడు.

    మరి మొదట్లో ఆయనే ప్రేక్షకులను తప్పుదోవ పట్టించాడు. ఇప్పుడు ఆయనే దానిని సరి చేసే పని పెట్టుకున్నాడు. ఇక మొత్తానికైతే కార్తీక్ సుబ్బరాజ్ సూర్య కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఒక పాత్ బ్రేకింగ్ మూవీగా మిగిలిపోతుందని సగటు ప్రేక్షకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళిద్దరికి ఎలాంటి సక్సెస్ దక్కుతుంది అనేది…