Lands and house Buyers :  భూములు, ఇళ్లు కొనేవారికి అలర్ట్.. ఈ విషయం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..

రియల్ ఎస్టేట్ రంగా అతి తక్కువ సమయంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. అందుకు ఈ రంగంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సరఫరా కావడమే. కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఓ నిబంధనను ఉంచింది. ఈ రంగంలో ఎవరైనా డబ్బు ఒకరి నుంచి ఇంకొకరికి ఇస్తున్న క్రమంలో తక్కువ మొత్తంలో చేతికి ఇవ్వాలి. పెద్ద మొత్తంలో బ్యాంకు నుంచి ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుంది.

Written By: Srinivas, Updated On : October 18, 2024 1:30 pm

 Lands and house Buyers

Follow us on

Lands and house Buyers :  ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీ పని డబ్బుతో ముడిపడి ఉంది. ఏది కొనాలన్నా.. ఎటు వెళ్లాలన్నా.. జేబులో లేదా అకౌంట్లో నగదు ఉంటే వ్యవహారం సాగుతుంది. ఆదాయం అందరికీ ఒకే రకంగా ఉండదు. కొందరికి ఎక్కువగా..మరికొందరికి తక్కువగా వస్తుంది. ఈ క్రమంలో కొందరు ఎక్కువ ఆదాయం వచ్చిన వారు వివిధ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబుడలు పెడుతున్నారు. దీంతో భారీ మొత్తంలో క్యాష్ ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటుంది. అయితే ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే సమయంలో నగదు ఇచ్చి, పుచ్చుకునే వ్యవహారాలు ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని ఫైనాన్స్ సూత్రాలు పాటించాలి. లేకుంటే భారీగా జరిమానా కట్టాల్సి వస్తుంది. అసలెందుకు జరిమానా కట్టాలి?

రియల్ ఎస్టేట్ రంగా అతి తక్కువ సమయంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. అందుకు ఈ రంగంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సరఫరా కావడమే. కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఓ నిబంధనను ఉంచింది. ఈ రంగంలో ఎవరైనా డబ్బు ఒకరి నుంచి ఇంకొకరికి ఇస్తున్న క్రమంలో తక్కువ మొత్తంలో చేతికి ఇవ్వాలి. పెద్ద మొత్తంలో బ్యాంకు నుంచి ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో భారీగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

ఉదాహరణకు రాజు అనే వ్యక్తి రాము వద్ద భూమి కొనుగోలు చేశాడు. భూమి ధర రూ.20 లక్షలకు విక్రయిస్తున్నారని అనుకుందాం. ఈ సమయంలో రాజు భూమికి సంబంధించిన నగదును కేవలం రూ.20 వేలు మాత్రమే క్యాష్ రూపంలో రాముకు ఇవ్వాలి. మిగతా రూ.19,80,000లను బ్యాంకు ద్వారా ట్రాన్స్ ఫర్ చేయాలి. ఆదాయపు పన్నుశాఖ సెక్షన్ 269SS ప్రకారం.. ఈ నిబంధనను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనను ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

ఒకవేళ దీనిని అతిక్రమించితే రూ.20వేల కంటే ఎక్కువగా ఎంత వరకు క్యాష్ రూపంలో ఇస్తారో.. అంతే మొత్తంలో 100 శాతం పెనాల్టీ ఉంటుంది. అంటే రూ. 20 లక్షల రూపాయలల్లో రూ.10 లక్షలు చెల్లించి.. మిగతా రూ.10 లక్షలు బ్యాంకు ద్వారా చెల్లించాలని అనుకున్నా.. ఆ అమౌంట్ మొత్తం మళ్లీ ఆదాయంపు పన్నుశాఖకు కట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఆదాయపు పన్ను శాఖ ప్రకారంగా ఎక్కువ మొత్తంలో క్యాష్ రూపంలో కాకుండా బ్యాంకు ట్రాన్స్ ఫర్ చేయాలి. అప్పుడే ఎలాంటి జరిమానా పడదు.

చాలా మంది ఎక్కువ డబ్బు ఉన్న వారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఆదాయం ఎవరి దగ్గర ఎక్కువ ఉందో తెలియకుండా పోతుంది. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో మనీ ట్రాన్స్ ఫర్ ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల వాటి వివరాలు తెలిసేందుకే ఆదాయపు పన్ను శాఖ ఈ నిబంధనను తీసుకొచ్చిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువల్ల భూములు, ఇళ్లు కొనేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం.