https://oktelugu.com/

Mahesh Babu : ఏ హీరో కూడా సాధించని రికార్డు కేవలం మహేష్ కే సాధ్యమా? ఇంతకీ ఏంటంటే?..

ఎన్ని సినిమాలు చేసినా సరే కానీ ఈయన స్టైల్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అందుకే రాజమౌళి మహేష్ బాబును పూర్తిగా మార్చే ప్లాన్ వేశారట. టాప్ స్టార్ గా అవతరించిన ప్రిన్స్ గత ఐదు సినిమాలద్వారా తెలుగు హీరోలెవరికీ సాధ్యంకాని రికార్డులను సొంతం చేసుకున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 21, 2024 / 04:49 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం అవసరం లేదు. హిందీలో సినిమాలు చేయకపోయినా సరే ఎన్నో ఇండస్ట్రీల ప్రజలకు కూడా మహేష్ బాబు అంటే పరిచయమే. ఈ స్టార్ హీరో ఎన్ని అవకాశాలు వచ్చినా పాన్ ఇండియాలు సినిమాలుకానీ, హిందీలో సినిమాలుకానీ నటించలేదు. కేవలం తెలుగులో మాత్రమే నటించారు మహేష్ బాబు. ఈ ఇండస్ట్రీలో మాత్రమే సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. మహేష్ బాబు సైలెంట్ గా ఉంటే మాత్రం దర్శక ధీరులు ఊరుకుంటారా? అందులో రాజమౌళి ఊరుకుంటారా? ఎంతో మంది హీరోలను పాన్ ఇండియా రేంజ్ లో నిలబెబ్టారు.

    అందుకే ఏకంగా పాన్ ఇండియా ఏం ఖర్మా ఏకంగా పాన్ వరల్డ్ చేద్దామంటూ మహేష్ బాబుతో గట్టి ప్లాన్ చేశారు రాజమౌళి. రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉంటుందా బాస్. నియమ నిబంధనలు, ఆ రేంజ్ వర్క్ కూడా ఉండాల్సిందే. ఇక సినిమా పూర్తి అవ్వాలంటే కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియదు.

    ఎన్ని సినిమాలు చేసినా సరే కానీ ఈయన స్టైల్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అందుకే రాజమౌళి మహేష్ బాబును పూర్తిగా మార్చే ప్లాన్ వేశారట. టాప్ స్టార్ గా అవతరించిన ప్రిన్స్ గత ఐదు సినిమాలద్వారా తెలుగు హీరోలెవరికీ సాధ్యంకాని రికార్డులను సొంతం చేసుకున్నారు. భరత్ అనే నేను సినిమాద్వారా రూ.101 కోట్ల షేర్ రాబట్టారు మహేష్ బాబు. ఆ తర్వాత చేసిన మహర్షి సినిమాకు రూ.105 కోట్ల షేర్ సంపాదించారు. మహర్షి తర్వాత సరిలేరు నీకెవ్వరూ సినిమాకు రూ.139 కోట్ల షేర్ సంపాదించారు. సర్కారువారిపాట సినిమాకు ఏకంగా రూ.111 కోట్ల షేర్ వచ్చి చేరింది. ఇక గుంటూరు కారం సినిమాద్వారా రూ.112 కోట్ల షేర్ వచ్చింది. వరుసగా ఈ ఐదు సినిమాలకు రూ.567 కోట్ల షేర్ రాబట్టి ఏ హీరో కూడా సాధించని రికార్డు సాధించారు మహేష్ బాబు.

    భరత్ అనే నేను, మహర్షి కాకుండా చివరి మూడు సినిమాలు మహేష్ బాబు స్థాయి సినిమాలు రాలేదనే చెప్పాలి. కానీ ఆ సమయంలో అగ్ర దర్శకులెవరూ ఖాళీగా లేరు. కొత్త దర్శకులతోనే సినిమాలు చేసి తనకున్న క్రేజ్ ద్వారా వాటిని సూపర్ హిట్లుగా నిలిచేలా చేశారు మహేష్ బాబు. ఆ సినిమాలు మహేష్ బాబు వల్లనే థియేటర్ లలో మంచి టాక్ ను సంపాదించాయి అంటున్నారు నెటిజన్లు. సర్కారువారిపాట యావరేజ్, గుంటూరు కారం ఫ్లాప్. అయినా వాటికి కూడా షేర్ వచ్చిందంటే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం మా మహేష్ బాబుదే అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. తెలుగులో మరే హీరోకు ఈ రికార్డు సాధ్యం కాలేదు అనడంలో సందేహం లేదు. అయితే ఈ టాక్ కేవలం నార్మల్ స్టోరీల వరకు మాత్రమే. మరి రాబోయే సినిమా రాజమౌళితో.. అది కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో.. ఇక ఈ సినిమా వసూల్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు.