https://oktelugu.com/

Nag Ashwin: నాగ్ అశ్విన్ కి క్రేజ్ ఆఫర్స్ ఇస్తున్న బాలీవుడ్ హీరోలు…మరి ఆయన రియాక్షన్ ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకుంటే చాలు అవకాశాల వెల్లువ విరుస్తుందనే చెప్పాలి. ఇక ఒక్కసారి ఒక దర్శకుడు సక్సెస్ సాధించాడు అంటే తన తదుపరి సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకోవాలబే ఉద్దేశ్యంతో ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 04:36 PM IST

    Nag Ashwin

    Follow us on

    Nag Ashwin: ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళందరూ మన బాహుబలి దెబ్బకి ఢీలా పడిపోయారనే చెప్పాలి. ఇక అప్పట్నుంచి ఇప్పటివరకు వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో వాళ్ళకి ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావడం లేదు. ఇక అందుకే వాళ్ళు చేసే సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది…

    సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకుంటే చాలు అవకాశాల వెల్లువ విరుస్తుందనే చెప్పాలి. ఇక ఒక్కసారి ఒక దర్శకుడు సక్సెస్ సాధించాడు అంటే తన తదుపరి సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకోవాలబే ఉద్దేశ్యంతో ఉంటాడు. కాబట్టి దానికి తగ్గట్టుగానే హీరోలను కూడా చూస్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న నాగ్ అశ్విన్ ప్రతిభను గుర్తించిన ప్రతి ఒక్క హీరో కూడా తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించినప్పటికి కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన్ రేంజ్ మారిపోయింది. ఇక అందులో ప్రభాస్ హీరోగా నటించాడు కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ప్రతి ఒక్క హీరో కూడా అతనితో ఒక్క సినిమా అయిన చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలందరు నాగ్ అశ్విన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు కూడా మన నాగ్ అశ్విన్ తో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న హీరోలు దర్శకులను ఎంచుకోవడంలో మాత్రం చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    ఇక ముఖ్యంగా బాలీవుడ్ హీరోలైతే ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారనే చెప్పాలి. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి తెలుగు దర్శకులతో సినిమాలు సెట్ చేసుకోవడం ఒకటే వాళ్ళ ముందున్న ఆప్షన్ గా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరుకి సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ మన దర్శకులు ముందుకు సాగుతున్నారు.

    మరి ఇలాంటి సందర్భంలో మనవాళ్లను టార్గెట్ చేసి మన దర్శకులతో సినిమాలు చేస్తేనే ఇప్పుడు బాలీవుడ్ హీరోలు భారీ కలెక్షన్లు రాబడతారు. కాబట్టి ఎలాగైనా సరే మన డైరెక్టర్స్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి సినిమా చేయించుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్న మన దర్శకులు బాలీవుడ్ హీరోల ట్రాప్ లో పడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…