https://oktelugu.com/

Konda Surekha: కొండ సురేఖ చేయాల్సిన నష్టం చేసి సారీ చెబితే సరిపోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ అయితే జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటుల మధ్య చాలా మంచి సంబధాలైతే ఎదురవుతూ ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : October 3, 2024 / 03:42 PM IST

    Konda Surekha(2)

    Follow us on

    Konda Surekha: తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అదిక్రం లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆ పార్టీ లో ఫారెస్ట్ మినిస్టర్ గా కొనసాగుతున్న కొండా సురేఖ రీసెంట్ గా సమంతను అక్కినేని ఫ్యామిలీ ని ఉద్దేశించి కొన్నిసభ్యకరమైన వ్యాఖ్యలు అయితే చేసింది. ఇక దానిమీద పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం చాలా ఘాటు గా రియాక్ట్ అయ్యారు. ఆమె మాట్లాడిన దాంట్లో చాలా వరకు తప్పు ఉందని చెప్పడంతో వెంటనే ఆమె తను అలా మాట్లాడడం తప్పు అంటూ అక్కినేని ఫ్యామిలీకి సమంతకు సారీ చెప్పింది. ఇక్కడితో రచ్చ మొత్తం ముగిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన ఆమె మాట్లాడిన మాటలు గాని వాళ్ళ గురించి జనాల్లోకి వెళ్లిన న్యూస్ కానీ వెనక్కి తిరిగిరాదు కదా…అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఇలాంటివి ఒకటికి రెండుసార్లు చూసుకుని మాట్లాడితే బాగుంటుంది అంటూ పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఆమె మీద తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. నిజానికి సినిమా సెలబ్రిటీల మీద రాజకీయ నాయకులు తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకు నచ్చదో ఎవరికి తెలియదు. ఇక మొత్తానికైతే వాళ్ళు చేసిన వాక్యాలు చిన్న సారీ తో సరిపెట్టుకునేవి అయితే కావు. దీనివల్ల ఎవరైతే కామెంట్స్ కి గురవుతారో వాళ్ళ కుటుంబాలు సఫర్ అవుతూ ఉంటాయి.

    అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉంటారు. అందువల్లే ఒకసారి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడిన తర్వాత సారీ చెబితే జరిగిన నష్టాన్ని భర్తీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇక ఈ సంఘటన మీద కొండ సురేఖ సారీ చెప్పినప్పటికీ సమంత అభిమానులు గాని, అక్కినేని ఫాన్స్ గాని ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

    ఇక సగటు ప్రేక్షకుడు ఇలాంటి సంఘటనలు నిజంగానే జరిగాయా అని నమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జనం చేత ఎన్నుకోబడిన నాయకుడు జనాన్ని కాపాడాల్సింది పోయి ఇలాంటి చీప్ మాటలు మాట్లాడటం వల్ల వాళ్ల పరువును వాళ్ళు తీసుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిన వారవుతారు.

    ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఆమె మీద అక్కినేని అభిమానులు సమంత అభిమానుల కోపం ఇంకా చల్లారినట్టుగా కనిపించడం లేదు. ఇక ఈ విషయం ఎక్కడి దాకా వెళుతుంది అనేది తెలియాలంటే మాత్రం మనం వేచి చూడాల్సిందే…