https://oktelugu.com/

త్రివిక్రమ్‍ తో మహేష్ కి ఇక కష్టమే.. కారణం అదేనా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటేనే.. హీరోలకు విపరీతమైన నమ్మకం.. అందుకే ఆయన డైరెక్షన్ లో పని చేయాలని, సూపర్ స్టార్లు దగ్గర నుండి చిన్నాచితకా నటీనటులు వరకూ ఆశ పడుతుంటారు. దీనికితోడు, ‘అలవైకుంఠపురంలో’ అంటూ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాకా.. ఇక ఎంతమంది హీరోలు పోటీ పడాలి..? అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి చాల ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య ట్విట్టర్ లో డైరెక్ట్ గానే త్రివిక్రమ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2020 / 01:39 PM IST
    Follow us on


    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటేనే.. హీరోలకు విపరీతమైన నమ్మకం.. అందుకే ఆయన డైరెక్షన్ లో పని చేయాలని, సూపర్ స్టార్లు దగ్గర నుండి చిన్నాచితకా నటీనటులు వరకూ ఆశ పడుతుంటారు. దీనికితోడు, ‘అలవైకుంఠపురంలో’ అంటూ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాకా.. ఇక ఎంతమంది హీరోలు పోటీ పడాలి..? అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి చాల ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య ట్విట్టర్ లో డైరెక్ట్ గానే త్రివిక్రమ్ తో త్వరలోనే ఒక సినిమా ఉంది అంటూ మహేష్ మెసేజ్ పోస్ట్ చేశాడు.

    Also Read: హిట్ లేకపోయినా బిజినెస్ బాగుంది !

    మహేష్ ఇంత డైరెక్ట్ గా మెసేజ్ పోస్ట్ చేయడానికి కారణం.. పర్సనల్ గా త్రివిక్రమ్ కి ఫోన్ చేసి మనం ఒక సినిమా చేద్దాం అనే ప్రపోజల్ మహేష్ పెట్టాడట. దానికి త్రివిక్రమ్ కూడా ఆసక్తి చూపించడంతో.. మహేష్ వెంటనే ట్వీట్ చేశాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‍ తో సినిమా చేయడానికి కమిట్‍ అయిన త్రివిక్రమ్‍, ఇప్పట్లో మహేష్‍ సినిమా స్టార్ట్ చేయడం అసాధ్యం. పోనీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్‍ అయిపోయాక మొదలుపెట్టొచ్చు అనుకుంటే.. అప్పటికి ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీద ఉంటుంది.

    Also Read: బిగ్‌బాస్ విజేత ఎవరు? చివరి వారంలో ఓట్లు.. ఎవరికి ఎంత అంటే!

    ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేసుకునే నాటికి.. రాజమౌళి సినిమా కోసం మహేష్‍ సమాయత్తమవుతుంటాడు. కాబట్టి మహేష్‍ తో మాత్రం త్రివిక్రమ్‍ సినిమా, ఇప్పట్లో వుండకపోవచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా రిలీజ్‍ అయి ఇప్పటికే పది సంవత్సరాలైంది. ఏది ఏమైనా స్టార్లు అంతా త్రివిక్రమ్ సినిమా కోసం ఎదురుచూడటానికి కారణం.. ఒక్క త్రివిక్రమ్ మాత్రమే హీరోల క్యారెక్టరైజేషన్ ను, వాళ్ళ టైమింగ్ ను చాలా డిఫరెంట్ గా చూపిస్తాడు. పైగా త్రివిక్రమ్ సినిమాలు అటు కమర్షియల్ గానూ ఆకట్టుకుంటాయి. ఇటు క్లాస్ ఆడియన్స్ ను మెప్పిస్తాయి. మరో వైపు త్రివిక్రమ్ మాస్ ప్రేక్షకుల పల్స్ ను వదలడు. అందుకే త్రివిక్రమ్ కి అంత డిమాండ్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్